ప్రపంచంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని హృదయాన్ని కదిలించేవి అయితే మరికొన్ని కడుపుబ్బా నవ్వించేవిగా ఉంటున్నాయి. సోషల్ మాద్యమాలతో ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. కొన్ని సార్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ వీడియో చూసి నెటిజన్లు పడీ పడీ నవ్వుకుంటున్నారు.
సాధారణంగా మహిళలకు అందం వారి కురులు అన్న విషయం తెలిసిందే. తమ అందమైన కురులను కాపాడుకునేందుకు బ్యూటీ పార్లర్లు.. మంచి ఆయిల్స్ వాడుతుంటారు. కురుల సంరక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే జుట్టు అందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో మంచి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతుంది. ఇక ఫన్నీ వీడియో సంగతికి వస్తే.. ఓ మహిళ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం అయ్యింది.
పక్కనే ఉన్న సహచరులు ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని అందించారు.. ఇంకేముంది ఆ మహిళ మరింత ఉత్సాహంతో స్విమ్మింగ్ పూల్ లోకి పల్టీలు కొడుతూ దూకింది. పల్టీలు కొట్టే సమయంలో మహిళ తలకు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై పడింది. అంతే అప్పటి వరకు వత్తుగా ఉన్న ఆమె కురులు ఉత్తవే అని తెలుసుకొని పక్కనే ఉన్నవారు పగలబడి నవ్వారు. నీటిలో దూకిన తర్వాత అసలు విషయాన్ని గమనించిన ఆ మహిళ సిగ్గుతో మొహం చిన్నబోయింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
She didn’t want to get her hair wet. 🥴🍺 pic.twitter.com/Dp9JcsRDQ8
— 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) August 29, 2021