ప్రస్తుత కాలంలో సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు చాలా మంది అంటే నూటికి 99 మంది బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అయితే వీటిల్లో ఉండే రసాయనాల వల్ల దీర్ఘకాలంలో అనేక సమస్యలు వస్తాయి. తాజాగా ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
మన అందం కోసం వినియోగించే సౌందర్య సాధనాలు(బ్యూటీ ప్రొడక్ట్స్) అనేక రసాయానల మిశ్రమం అనే సంగతి తెలుసు. వీటిని నిరంతరం వాడుతుంటే.. దీర్ఘకాలంలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకం కేవలం ఆర్థికంగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ నేటి కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు పండు ముసలి వాళ్ల వరకు.. ఏదో ఒక రకమైన బ్యూటీ ప్రొడక్ట్ వాడుతున్నవారే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు.. సాధారణంగా వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ముందుగా ఉండేది నెయిల్ పాలిష్. గోళ్ల అందం పెంచడం కోసం రంగురంగుల నెయిల్ పాలిష్‌లు వాడుతుంటారు. అయితే దీన్ని అతిగా వాడతే ఎంత ప్రమాదమలో తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన ద్వారా తెలిసి వచ్చింది. నెయిల్ పాలిష్ కారణంగా ఓ మహిళ చేతి వేళ్ల కదలిక కోల్పోయింది. ఆ వివరాలు..
ఓ మహిళ ఎన్నో ఏళ్లుగా నిత్యం అనేక రంగుల నెయిల్ పాలిష్‌లు వాడేది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. గోళ్లు విపరీతంగా నొప్పి పెట్టడమే కాక.. వేళ్ళ దగ్గర చర్మం చిరిగిపోయిన కాగితంలా మారిపోయింది. అంతేకాక వేళ్లు కదల్చలేని పరిస్థితి వచ్చింది. ఈ ఘటనతో భయపడిన సదరు మహిళ వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళింది. వైద్యులు ఆమెకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని భావించి.. యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేశారు. దాంతో ఇన్ఫెక్షన్ నయమైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె మళ్లీ మెయిల్ పాలిష్ వేసుకుంది. దీంతో తిరిగి అవే లక్షణాలు కనిపించాయి. ఈ సారి విపరీతమైన నొప్పితో చేతులు కూడా కదల్చలేని పరిస్థితికి వచ్చింది. గోళ్లు ఊదా రంగులోకి మారిపోయి, పెళుసుగా అయ్యాయి. విపరీతంగా దురద, నొప్పితో పాటూ ఆ లక్షణాలు చేతులకూ సోకాయి.
దాంతో సదరు మహిళ తిరిగి ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు బాధితురాలికి జెల్ నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు చర్మం లోకి ప్రవేశించి అలెర్జీని కలిగించినట్లు గుర్తించారు. దాంతో జీవితాంతం నెయిల్ పాలిష్ వేసుకోవద్దని సూచించారు. కాదని నెయిల్ పాలిష్ వేసుకుంటే.. ఈ అలెర్జీ వల్ల చేతి వేళ్లు కోల్పోయే పరిస్థితి రావచ్చని వైద్యులు హెచ్చరించారు. అయితే మహిళ పరిస్థితి ఇలా మారడానికి కారణం నెయిల్ పాలిష్‌లో ఉండే మెథాక్రిలేట్స్ అనే రసాయనం అన్నారు. ఇవి చర్మంలోకి ప్రవేశించి.. చెడు అలెర్జీలను కలిగిస్తాయి అంటున్నారు వైద్యులు. దీని వల్ల గోళ్లు పెళుసుగా మారడమే కాక.. విరిగిపోవడం, నొప్పి కలగడం వంటి పరిణామాలు తలెత్తుతాయి అంటున్నారు.
నెయిల్ పాలిష్ తరచుగా వేసుకోవడం వల్ల ఇలాంటి చెడు అలెర్జీలు వస్తాయిని.. కనుక నెయిల్ పాలిష్‌కు దూరంగా ఉండాలని.. తప్పదు అనుకుంటే కెమికల్స్ లేని వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. అయితే నేటి కాలంలో రసాయనాలు లేని నెయిల్ పాలిష్‌ను గుర్తించడం కష్టం అంటున్నారు నిపుణులు. నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఏమాత్రం రియాక్షన్ వచ్చినా.. వాటిని దూరం పెట్టాలని.. లేదంటే చేతి వేళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
అంతేకాక నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లకు ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకుని.. ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవడం ఉత్తమం అంటున్నారు. అలానే నెయిల్ పాలిష్‌లో ట్రైఫెనెల్ ఫాస్పెట్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది శరీరంలో చేరితే.. నేరుగా హార్మొన్లపైనే ప్రభావం చూపుతుంది. అంతేకాక నెయిల్ పాలిష్ వేసుకున్న చేతితో అన్నం తింటే ఆ రసాయనాలు పొట్టలోకి చేరే అవకాశం ఉంది. కనుక కుడి చేతికి నెయిల్ పాలిష్ వేసుకోకపోవడమే ఉత్తమం అంటున్నారు వైద్యులు.