పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. అది ఓ ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే.. రెండు జీవితాలు పెళ్లి బంధంతో ఒక్కటైతే.. కానీ, ఓ వ్యక్తి తనను తాను పెళ్లి చేసుకోవటం కూడా స్వర్గంలో నిశ్చయించబడి ఉంటాదా? అన్నది క్వశ్చన్ మార్క్.
పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని ఒక్కటి చేసే బంధం. కష్టమో.. సుఖమో.. కలిసి ఉండటమో.. విడిపోవటమో బంధంలో ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకున్న 90 శాతం మంది దాన్ని ఓ భయంకరమైన అనుభవంగా చెప్పుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోకున్నా బాగుండేది అంటూ ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి చేసుకోవద్దని, చేసుకుంటే ఇబ్బందులు తప్పవని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. లేనిపోని తలనొప్పులు ఎందుకని కొంతమంది పెళ్లికి దూరంగా ఉంటూ ఉంటే.. మరి కొంతమంది వింత వచిత్రమైన పనికి తెర తీస్తున్నారు. ఆ వింత, విచిత్రమైన పని ఏంటంటే.. తమను తాము పెళ్లి చేసుకోవటం. గతంలో చాలా మంది తమను తాము పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలక్రితం గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనను తాను పెళ్లి చేసుకుంది.
సాధారణంగా పెళ్లిలో ఏఏ వేడుకలు నిర్వహిస్తారో అన్ని వేడుకలతో ఈ వివాహం జరిగింది. తాజాగా, మరో యువతి తనను తాను పెళ్లి చేసుకుంది. ఆ యువతి తనను తాను పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకున్న 24 గంటల్లోనే విడాకులు తీసుకోవటం కథలో కొసమెరుపు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాకు చెందిన 25 ఏళ్ల సోఫీ మోరేకు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిబ్రవరి 19న సోఫీ తన ఫాలోవర్స్‌కు ఓ విచిత్రమైన న్యూస్ చెప్పింది. తనను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి డ్రెస్‌లో ఉన్న ఫొటోలు, పెళ్లి కేకు ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
కొంతమంది పిచ్చి చేష్టలంటూ కామెంట్లు చేశారు. సరిగ్గా 24 గంటల తర్వాత సోఫీ తన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు తాను విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. తనతో తాను గడపటం చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొంది. తాను చేసింది ఓ పిచ్చి పని అంది. ఇక, దీనిపై నెటిజన్లు విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అటెన్షన్ కోసమే సోఫీ అలా చేస్తోందని అన్నారు. ఎక్స్‌ప్రెస్ డివర్స్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. మరి, తనను తాను పెళ్లి చేసుకుని, 24 గంటల్లోనే విడాకులు కూడా తీసుకున్న ఈ యువతి కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.