దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మేవాళ్లు.. ఇండియాలో కంటే ఫారెన్ దేశాల్లోనే చాలా ఎక్కువ. మూఢ నమ్మకాలకు కొన్ని దేశాలు పెట్టింది పేరు. అలాంటి దేశాల్లో వింత, విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఈ సమాజంలో దెయ్యాలు ఉన్నాయని గట్టిగా నమ్మేవాళ్లు.. లేవని కొట్టిపారేసేవారు రెండు రకాలు ఉన్నారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్న డిబేట్ పక్కన పెడితే.. దెయ్యాలకు సంబంధించిన కొన్ని వింత సంఘటనలు అప్పుడప్పడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నపుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే. ఓ ప్రముఖ సింగర్ దెయ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నెలలు గడవకముందే భర్త దెయ్యం తనను వేధిస్తోందంటూ విడాకులకు సిద్ధమైంది. ఈ వింత విచిత్రమైన సంఘటన ఇంగ్లాండ్లో చోటుచేసుకుంది.
సదరు సింగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్‌కు చెందిన రాకర్ బ్రోకార్డేకు సింగర్‌గా మంచి పేరుంది. ఆమెకు ఐదు నెలల క్రితం ఎడ్వర్డో అనే ఓ మగ దెయ్యంతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2022లో హాలోవెన్ డే రోజున ఓ పాడుబడ్డ చర్చిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన కొన్ని రోజులు వీరి కాపురం బాగానే సాగింది. తర్వాతి నుంచి గొడవలు అవటం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాకర్ వేరుగా ఉండటానికి సిద్దమైంది. విడాకులకు పూనుకుంది. ఈ విషయం భర్తకు చెప్పింది. దీంతో అతడు రగిలిపోయాడు. ఇక ఇప్పటినుంచి ఆమెను వేధించటం మొదలుపెట్టాడు.
చిన్న పిల్లల ఏడుపులతో రాకర్‌ను హింసిస్తూ ఉన్నాడు. దీంతో భూత వెద్యం ద్వారా భర్త పీడ విరుడగ చేసుకోవటానికి చూస్తోంది. ఇక, ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ మేము చనిపోయిన వారిని, బతికున్న వారిని పెళ్లికి పిలిచాము. మార్లిన్ మన్రో, ఎవిస్, హెన్రీ 8 తదితరులు మా పెళ్లికి వచ్చారు. పెళ్లి సమయంలోనే ఎడ్వర్డో తప్పుడు కామెంట్లు చేశాడు. నాముందే మార్లిన్ మన్రో హాట్‌గా ఉందని అన్నాడు. అతడితో కాపురం దారుణంగా ఉండేది. సీరియస్‌గా రిలేషన్‌ను కంటిన్యూ చేద్దాం అని అతడికి చెప్పి చూశాను. కానీ, అతడు నా మాట వినలేదు. ఎప్పుడూ నన్ను వేధిస్తూ ఉండేవాడు’’ అని చెప్పుకొచ్చింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.