వైద్యరంగంలో అనేక విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. గర్భిణీల విషయంలో కూడా చాలా వింతైన ఘటనలు జరగడం మనం చూస్తుంటాం. అలా జరిగే ప్రతి దానికి వైద్యలు బలమైన కారణాలు వెల్లడిస్తారు. అలానే తాజాగా ఓ మహిళ ఒకే బిడ్డకు రెండు సార్లు జన్మ ఇవ్వబోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ఇప్పటికే ఆ మహిళకు పిల్లాడు పుట్టాడు. అతడే మరోసారి జన్మించనున్నాడు. మరి..ఆ విచిత్రమైన వార్తలోని పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాకు చెందిన అష్లియా అనే 23 ఏళ్ల మహిళ డిజిటల్ కంటెంట్ క్రియేటర్, రియల్టర్. ప్రస్తుతం ఆమె 4నెలల గర్భవతి. ఆమె ఆరోగ్యం నిమిత్తం ప్రతి నెల స్థానిక ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటుంది. ఈ క్రమంలో మార్చిలో కూడా ఆమెకు వైద్యులు ప్రినాటల్ అనాటమీ స్కాన్ చేశారు. ఆ స్కాన్‌లో డాక్టర్లకు ఓ విషయం తెలిసింది. అది ఏమిటంటే.. పుట్టబోయే బిడ్డకు స్పినా బిఫిడా అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇదో ఓ అరుదైన రోగం. బిడ్డ పుట్టాక.. వెన్నెముక పై ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది చివరికి మనిషి పక్షవాతం వచ్చేలా చేయగలదు. ఈ వార్త చెప్పగానే.. అష్లియాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు.ఎలాగైనా బిడ్డను బతికించుకోవాలి అని ఆ తల్లి పరితపించింది. ఒర్లాండోలో స్పెషలిస్ట్ డాక్టర్లను కలిసింది. అక్కడి డాక్టర్లకి ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఆమె బిడ్డను బయటకు తీసి.. అనారోగ్యాన్ని సరిచేసి.. తిరిగి లోపల పెట్టాలని అనుకున్నారు.
ఇదీ చదవండి: ఆమె వయసు 32.. పెళ్లిల్లు 32.. మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. షాకిచ్చిన పోలీసులు!అదే విషయాని అప్లియాకి చెప్పారు. ఈ ఆపరేషన్ లో భాగంగా బిడ్డ బతికే అవకాశాలు సగం..సగం ఉంటాయని వైద్యులు తెలిపారు. మే 11, 2022న బిడ్డ వెన్నెముఖకు ఆపరేషన్ చేసి తిరిగి ఆమె కడుపులో సెట్ చేశారు. ప్రస్తుతం అష్లియాకి 27 వారాల ప్రెగ్నెన్సీ ఉంది. ప్రస్తుతం బిడ్డా ఆరోగ్యం క్రమంగా పెరుగుతున్నట్లు స్కాన్ రిపోర్టులో తెలింది. అష్లియాకి జులైలో డెలివరీ అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్ ద్వారా తన ఫాలోయర్స్‌కి తెలిపింది. వైద్య శాస్త్రం ఎంతలా అభివృద్ధి చెందిందో ఈ ఘటన చెబుతోంది. ఈ అరుదైన వార్త నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటుంది. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.