కొంతమంది మనుషులకు, వింత వింత అలవాట్లు, వ్యసనాలు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. రాళ్లను తినే వాళ్లు.. మట్టిని తినేవాళ్లు.. ఆఖరికి ఇనుమును తినేవాళ్లు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. తాజాగా, వీరికంటే విభిన్నమైన వ్యసనం ఉన్న ఓ మహిళ వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఏకంగా పడుకునే పరుపులను తినేస్తోంది. కొంచెం కొంచెం కాదు.. ఇప్పటికే చాలా పడుకునే పరుపులను తినేసింది. ఈ సంఘటన అమెరికాలోని చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన జెన్నిఫర్ అనే యువతికి ఓ వింత వ్యసనం ఉంది. ఆమె పడుకునే పరుపులను తినేస్తోంది. ఆమెకు 5 ఏళ్ల వయసు ఉన్నపుడు ఈ అలవాటు మొదలైంది. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది.
దాదాపు 20 ఏళ్లుగా పరుపులను తినేస్తోంది. తన కుటుంబానికి చెందిన కారు సీటులోని స్పాంజీని తినటం దగ్గరినుంచి ఈ అలవాటు మొదలైంది. తర్వాతి కాలంలో అది దారుణమైన వ్యసనంగా మారింది. ఆఖరికి తన పరుపును కూడా ఆమె తినేసింది. అది అయిపోగానే తన తల్లి పడుకునే పరుపును తినేసింది. అయితే, జెన్నిఫర్ కేవలం పరుపులోని స్పాంజీలను మాత్రమే తింటోంది. ఒకవేళ తినే స్పాంజీ గనుక వాసన వస్తే.. వాటిని తినటం మానేస్తోంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే.. ఆమె వ్యసనం కారణంగా ప్రాణాలకు ఏమీ ఇబ్బంది అవ్వటం లేదు. దీనిపై జెన్నిఫర్ మాట్లాడుతూ..
‘‘ నాకు తల కిందపెట్టుకునే దిండును తినటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది చాలా రుచిగా ఉంటుంది. పడుకునే పరుపును తినటం వల్ల నాకు కేవలం గ్యాస్ సమస్య మాత్రమే వస్తోంది. అంతకంటే ఏమీ లేదు.. స్పాంజీ నా కడుపులోకి వెళుతుంది. అక్కడినుంచి బయటకు వచ్చేస్తుంది’’ అని తెలిపింది. అయితే, ఆమెను డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలా స్పాంజీలను తినటం వల్ల భవిష్యత్తులో భారీ మూల్యం తప్పదు అంటున్నారు. కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి, ఈ మహిళ వింత వ్యసనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.