టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. దీంతో టర్కీ, సిరియా పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భూకంప ధాటికి బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి.. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని కన్నుమూశారు. ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపాల తీవ్రతకు టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది.
భారీ భూకంపం ప్రభావంతో తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఎటు చూసినా హహాకారాలు.. ఆర్తనాధాలు. శిథిలాల కింద వేల సంఖ్యలో మృతదేహాలు.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతు సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రాణాలు.. కళ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లలు.. వారికోసం తల్లడల్లిపోతున్న తల్లిదండ్రులు.. ఇలా టర్కీ, సిరియాలో ఎక్కడ చూసినా విషాద వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో హృదయవిదారకమైన దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.
శిథిలాల కింద ఓ తల్లి పండండి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తల్లి కన్నుమూసింది. సహాయకచర్యల్లో పాల్గొన్న కొంత మంది శిథిలాలను తొలగిస్తున్న సమయంలో బిడ్డ ఏడుపు వినిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే మగ శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దృశ్యం చూస్తుంటే హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి.
మరోవైపు భూకంప ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి తన తండ్రి ఎదుటే కన్నుమూశాడు.. తన బిడ్డ ప్రాణాలు పోతున్నా రక్షించుకోలేని పరిస్థితిలో తండ్రి బోరున విలపిస్తున్న దృశ్యం అందరి మనసు కలిచివేశాయి. ఎంతో మంది చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతంగా మారిపోయింది. ఇదిలా ఉంటే తుర్కియే లో భూకంపం ప్రభావం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. వరుస భూకంపాలతో దేశం అల్లకల్లోలం అయ్యిందని దీనికి ఎంతో చింతిస్తున్నామని అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు.
The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake.
May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW— Talha Ch (@Talhaofficial01) February 6, 2023
Earthquake leaves over 4,300 Dead in Turkey and Syria…people have lost their entire families…#earthquake #earthquakeinturkey #Turkey #earthquaketurkey #Syria #syriaearthquake #Turkiye #Turkish pic.twitter.com/qDgoEWvXvq
— Jyot Jeet (@activistjyot) February 7, 2023