Gravestone: ఈ సృష్టిలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఉంది. అలాంటి భార్యాభర్తల బంధాన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. చెడు తిరుగుళ్లు, అక్రమ సంబంధాలతో భాగస్వాములను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. జాన్ డోయ్ కూడా అక్రమ సంబంధంతో తన భార్యకు ద్రోహం చేశాడు. ఆఫీస్‌లో పనిచేసే సహోద్యోగితో సంబంధం పెట్టుకుని ఆమెను తల్లిని కూడా చేశాడు. భార్యకు విడాకులు ఇచ్చి ప్రియురాలితో సంతోషంగా ఉండాలనుకున్నాడు. ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. భర్తపై పీకల్లోతు కోపం ఉన్న భార్య ఎవ్వరూ చేయని పని చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలంటే మిగితా స్టోరీ చదివేయాల్సిందే.. కెనడాకు చెందిన జాన్ డోయ్‌కి చాలా ఏళ్ల క్రితమే పెళ్లయింది.
ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే, పెళ్లయిన కొన్నేళ్లకు జాన్ తన ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఏకంతంగా కలుసుకునే వారు కూడా. ఇదే విషయమై జాన్‌కు భార్యతో గొడవలు జరిగేవి. ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లింది. ఇద్దరూ విడాకులకు అంగీకరించారు. విడాకులు పైల్ చేయటానికి సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలోనే జాన్ డోయ్ ప్రియురాలు గర్భం దాల్చినట్లు తెలిసింది. దీంతో జాన్ సంతోషించాడు. భార్య,కొడుకును వదిలేసి గత కొన్ని నెలల నుంచి ప్రియురాలితో కలిసుంటున్నాడు. ఓ రోజు ప్రియురాలితో ఏకాంతంగా కలిసి ఉండగా జాన్ డోయ్ చనిపోయాడు.
విడాకులకు ఫైల్ చేయకుండానే భార్యను విడిచి దూరంగా వెళ్లిపోయాడు. అయితే, జాన్ చనిపోయినా భార్యకు అతడి మీద కోపం, ద్వేషం తగ్గలేదు. అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత సమాధి రాయిపై రాతలతో తన కోపాన్ని వెల్లగక్కింది. ఆ సమాధి రాయిపై ‘ జాన్ డోయ్ జ్ఞాపకార్థంగా.. జాన్ డోయ్ ఓ తండ్రికి కొడుకు.. ఓ భార్యకు భర్త.. ఓ కొడుక్కి తండ్రి.. ఓ వ్యభిచారి’’ అని చెక్కించింది. దీనిపై కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడే కాదు! జాన్‌డోయ్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కూడా దాన్ని తప్పుబడుతున్నారు. సమాధి రాయిపై వ్యభిచారి అని రాసి ఉన్న ఫొటోలు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి : TANA Director: అమెరికాలో ఘోర ప్రమాదం.. తానా డైరెక్టర్ భార్యా- కుమార్తెలు మృతి!