చాలా మందికి నాని హీరోగా నటించిన “పిల్ల జమీందార్” సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తన వారసత్వ ఆస్తులు ఇచ్చేందుకు హీరో తాత.. హీరోకి కొన్నిషరతులు పెడతారు. అప్పటి దాకా రాజభోగం అనుభవించిన ఆ హీరో.. తాత పెట్టిన కండీషన్స్ విని షాకవుతాడు. కానీ ఆస్తులు లేకపోతే తన బ్రతకలేని గ్రహించి ఆ కండీషన్స్ కి హీరో ఒప్పుకుంటాడు. ఆ తరువాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తరువాత సమాజం అంటే ఏమిటే హీరో తెలుసుకుంటాడు. ఇది సినిమా కథ. అయితే ఇంచుమించు ఇలానే ఓ తండ్రి తన కూతురికి వారసత్వ ఆస్తుల కోసం ఓ కొత్త షరతు విధించాడు. తన రూ.93 కోట్ల విలువ చేసే ఆస్తి రావాలంటే తను పెట్టిన షరత్ ను కచ్చితంగా పాటించాలని ఆదేశించాడు. ఇక పూర్తి వివరాలేంటే ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి రూ. 93 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. ఆయనకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు క్లేర్ బ్రౌన్. ఆమెకు వివాహం అయి భర్తతో కలసి జీవిస్తుంది. అయితే తన తండ్రి ఆస్తి కావాలని కోరుకుంది. అయితే తన ఆస్తి.. తన కూతురుకి చెందాలంటే కొత్త నియమం పెట్టాడు. ఆమె శాశ్వతమైన ఉద్యోగాన్ని సంపాదించాలని, అందులోంచి ఎంతో కొంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలని వీలునామాలో పొందుపరిచాడు. ట్రస్టు నుంచి ఫండ్స్ రావడం ఒక్కసారిగా ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇక ఏమి చేసేది లేక ఆమె కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి వీలునామ ప్రకారం ఆస్తులు దక్కుతాయని, శాశ్వత ఉద్యోగం దొరికితే తప్ప ఆ ఆస్తులను పొందలేవని క్లేర్‌కు కోర్డు తీర్పుచ్చింది. దాంతో ఇరకాటంలో పడింది.
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవడంతో తండ్రి ఆస్తులు కూడా దక్కడం లేదు. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం కూడా తన జీవిత భాగస్వామిపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతోంది క్లేర్. ఉద్యోగమే దొరికితే ఆస్తులతో తనకేం పని అని ప్రశ్నిస్తోంది. ADHDతో బాధపడుతున్నందున తండ్రి పెట్టిన రెండు నిబంధనలనూ తాను అందుకోలేనని చెబుతోంది. ఆస్తులుండి… అనుభవించలేని ఆమె దీనస్థితికి ఆమె కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు. మరి.. క్లేర్ తండ్రి పెట్టిన నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.