ఆమె కేవలం మూడు వందల లోపు రూపాయలకే మూడు ఇళ్లను కొంది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున నెటిజన్లు..
‘ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని తెలుగులో ఓ సామెత ఉంది. పెళ్లి చేయటం.. ఇళ్లు కట్టడం అంత ఈజీ కాదని చెప్పటమే ఆ సామెత ఉద్దేశ్యం. ఏ కాలానికైనా ఇవి సరిగ్గా సరిపోతాయి. పెళ్లి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడున్న పరిస్థితిలో స్థలం కొని ఇళ్లు కట్టించటం.. లేదా ఇళ్లు కొనుక్కోవటం చాలా కష్టం. పేద మధ్య తరగతి వాళ్లు.. ఒక్కో రూపాయి చేర్చి ఇళ్లు కట్టే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఇళ్లు కొనాలన్నా.. కట్టించాలన్నా లక్షలు, కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. అలాంటి ఈ పరిస్థితుల్లో ఓ మహిళ కేవలం 270 రూపాయలకే మూడు ఇళ్లు కొంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అయితే, ఆమె ఇళ్లు కొన్నది మన దేశంలో కాదు.. పర్యాటక దేశం ఇటలీలో. ఇంతకీ సంగతేంటంటే.. ఇటలీలో సంబుక అనే పిక్షర్ స్క్వయర్ హిల్ టాప్ టౌన్ ఉంది. ఆ టౌన్‌లో జనాభా బాగా తగ్గిపోతుండటంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ద్వీపాలు, ఇసుక బీచులు, ఇళ్లు తక్కువ ధరకే అమ్మేసింది. అది కూడా కేవల ఒక డాలర్‌కు మాత్రమే ఆ ఇళ్లను అమ్మేసింది. ఇది 2019 సంవత్సరంలో జరిగింది. అంతేకాదు! జనాభా తగ్గిపోతోందని భావించిన చిన్న చిన్న టౌన్‌లు కూడా తమ దగ్గర ఉన్న పాత ఇళ్లను అమ్మటం మొదలుపెట్టాయి.
ఈ నేపథ్యంలోనే బ్రెజిల్‌కు చెందిన 49 ఏళ్ల రుబియా డేనియల్స్ ఓ మూడు పాడుబడ్డ ఇళ్లను కొంది. అది కూడా కేవలం 270 రూపాయలకు మాత్రమే. తర్వాత వాటిని రెనవేట్ చేయించి వాటిని అద్దెకు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, బ్రెజిల్‌కు చెందిన రుబియా డేనియల్స్ 270 రూపాయలకే మూడు ఇళ్లు కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.