ఇకపై కరోనా వైరస్ మన జీవితంలో ఓ భాగం. మనం దానితో సహజీవనం చేయాల్సిందే. మొదట్లో శాస్త్రవేత్తలు, కాస్త అవగాహన ఉన్న నాయకులు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచం అంతా నవ్వింది. కానీ.., ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ రూపంలో రూపాంతరం చెందుతూ.., మానవాళి ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చింది. అసలే ఏంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్? దీని ప్రభావం ఎంత? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మనం వైరస్ ల గురించి ఒక విషయాన్ని చెప్పుకోవాలి. ఏ వైరస్ అయినా ఒక్కసారి పుట్టాక, తనని తాను సరికొత్తగా రూపాంతరం చెందించుకుంటూ ఉంటుంది. ఇక్కడ దాని బలం ఇంకాస్త పెరుగుతూ వస్తోంది. దీన్నే సైన్స్ పరిభాషలో వేరియంట్స్ అంటారు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో జరుగుతుంది కూడా ఇదే. కరోనా వైరస్ లో డెల్టా వేరియంట్‌ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ అంటారు. ఎందుకంటే ఇది ఇప్పటివరకు మూడు రకాలుగా రూపాంతరం చెందింది. ప్రధాన బి 1 వేరియంట్‌తో పోలిస్తే.., ఈ డెల్టా ప్లస్ వేరియంట్ లో 12 మ్యూటేషన్లు ఉన్నాయని వైరాలజిస్టులు అంటున్నారు. ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. డెల్టా వేరియంట్ నుండి పుట్టిందే డెల్టా ప్లస్ వేరియంట్. ఇప్పుడు ఇదే కొత్తగా ప్రపంచదేశాలని వణికిస్తోంది.
డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పటి వరకు కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికా దేశాల్లో కనిపించింది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు 100కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ డెల్టా ప్లస్ కేసును మొట్ట మొదటిసారిగా మార్చి చివర్లో ఐరోపాలో కనుగొన్నారు.ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంటుంది. పైగా.., కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు ఇది లొంగడం లేదు. కాబట్టి.., వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి కూడా డెల్టా ప్లస్ వేరియంట్ సోకవచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. విదేశాల్లో ఫైజర్, బయోన్ టెక్, అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది కూడా యువత మీదే. కాబట్టే.., దీన్ని భౌగోళిక ముప్పుగా పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
ఇండియా వంటి అధిక జనాభా ఉన్న దేశంలో డెల్టా వేరియంట్ కనుక ప్రబలితే అది మానవాళికే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. మన దేశంలో వచ్చిన సెకండ్ వేవ్.. డెల్టా వేరియంట్ కారణంగా వచ్చింది. దాని వల్లే అంత మంది హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వచ్చింది. మన వైద్య రంగం వణికిపోయే అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ద్వారా థర్డ్ వేవ్ కనుక వస్తే మానవాళి ఊహించని, ఊహించలేని ప్రమాదం జరుగుతుంది.
ఇప్పటికే ఇండియాలో ని కొన్ని నగరాల్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఓ కేసు నమోదు అయ్యింది. వీరందరికి ప్రత్యేక ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరి నివాస ప్రాంతాలను కోవిడ్ జోన్స్ గా నిర్బంధించారు. కాబట్టి ఇప్పటికైతే భయపడాల్సిన పని లేదు. కానీ.., అవసరం లేకుండా బయట గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టే. గతంలో ఆల్ఫా, బీటా, గామా, ఎప్సిలాన్ వేరియంట్ ను దాటిన మానవాళికి ఈ డేటా ప్లస్ వేరియంట్ పెను సవాలుగా నిలవడం మన దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు.
ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.