మానవాళి మనుగడని ప్రశ్నార్థకం చేస్తూ.., వైరస్ ల దాడి కొనసాగుతూనే ఉంది. కరోనా వేవ్స్ రూపంలో మాటు వేసి కాటు వేస్తోంది. ఇదే సమయంలో బోలెడన్ని ఫంగస్ లు పుట్టుకొచ్చాయి. వీటి నుండి కాస్త కోలుకుంటున్నాం అనిపించే లోపే ఇప్పుడు అమెరికాని మంకీఫాక్స్ వైరస్ వణికిస్తోందో. అయితే.., ఇలాంటి భయంకరమైన వైరస్ లకి నిలయమైన చైనాలో ఇప్పుడు మరో కొత్త మహమ్మారి పుట్టుకొచ్చింది. కరోనా కన్నా ప్రమాదకరమైన మంకీ బి వైరస్ తొలి మరణం చైనాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ జర్నల్ నిర్ధారించింది. మరణించింది ఓ వెటరినరీ డాక్టర్ కావడం అందరిని షాక్ కి గురి చేస్తోంది.
మంకీ బి అనేది కోతుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్. బీజింగ్‌కు చెందిన పశువైద్యుడు.. తన వృత్తిలో భాగంగా పరిశోధనల కోసం ఈ ఏడాది మార్చిలో రెండు కోతుల కళేబరాలను ముక్కలు చేశాడు. ఆ తరువాతనే ఈ డాక్టర్ ఆరోగ్యం చెడిపోయింది. ముఖ్యంగా వాంతులు కంట్రోల్ కాక, ఆ డాక్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇలా డాక్టర్ మరణం చెందడం ఇప్పుడు కేవలం చైనాని మాత్రమే కాక, మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది.
నిజానికి మంకీ బి అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వైరస్ ఏమి కాదు. 1932లోనే మకాక్స్ అనే కోతి జాతిలో ఈ వైరస్ ని గుర్తించారు. ఒక్కసారి ఈ వైరస్ గనుక మనిషికి సోకితే బతికే అవకాశం 20 శాతం మాత్రమే. అంటే కరోనా కన్నా చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఇది కూడా అంటు వ్యాధి కావడం అందరిని కలవరానికి గురి చేస్తోంది. దీన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ జర్నల్ తెలియచేసింది. మరి.. మంకీ బి నివారణలో చైనా విజయం సాధిస్తుందా? లేక కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్ దేశం.. మరో మహమ్మారిని మానవాళి పైకి వదులుతుందా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.