పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని మధురానుభూతి. దాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ప్రస్తుత కాలంలో వివాహం ఒక ఆడంబర చిహ్నంగా మారింది. ఎంత గ్రాండ్‌గా చేస్తే అంత గ్రేట్ అన్నట్లు భావిస్తున్నారు నేటితరం వారు. అందుకే వెనకాముందు ఆలోచించకుండా లక్షలు ఖర్చు చేసి.. అప్పుల పాలవుతున్నారు. మధ్యతరగతి ఇళ్లల్లో పెళ్లి అంటే గుండెల మీద భారంగా మారింది. అయితే ఎంత ఖర్చయినా తల్లిదండ్రులే భరిస్తారు.. లేదంటే.. వధువరులు అంతకుముందే ఏమన్నా పొదుపు చేస్తే దాన్ని పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. అంతేతప్ప.. ఆ ఖర్చు మొత్తాన్ని బంధువుల నుంచి వసూలు చేయలేం కదా. కానీ ఇప్పుడు మీరు ఈ వార్త చదివితే.. ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపించక మానదు. ఇక్కడ ఓ వధువు.. తన పెళ్లికి పంపిన ఇన్విటేషన్‌లో బంధువులకు భారీ షాకే ఇచ్చింది. తన పెళ్లికి అయిన మొత్తాన్ని అతిథులే భరించాలని సూచించింది. ఇది చదివి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో సదరు వధువు స్నేహితుడు ఒకరు రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
అమెరికా, వాషింగ్టన్‌కు చెందిన ఒక జంట పెళ్లి ఖర్చు రూ.23 లక్షలకుపైగా ఉంది. దీంతో పెళ్లికి హాజరయ్యే అతిథులే అన్ని ఖర్చులు భరించాలని ఆ వధువు షరతు విధించింది. ఈ మేరకు తన స్నేహితులు, బంధువులకు ఆన్‌లైన్‌లో వెడ్డింగ్ కార్డ్ పంపింది. ఫొటోగ్రాఫర్, పెడిక్యూర్, వెడ్డింగ్ డ్రెస్ నుంచి హనీమూన్ వరకు అయ్యే ఖర్చులు అతిథులే భరించాలని అందులో పేర్కొంది. ‘బహుమతులు వద్దు, అన్ని ఖర్చులకు డబ్బులు ఇవ్వండి’ అని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఫ్లైట్‌లో మంటలు.. డేంజర్ లో 185 ప్రాణాలు.. సమయస్ఫూర్తితో రక్షించిన లేడీ పైలట్!
కాగా, వధువు పంపిన ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న ఒక వ్యక్తి దానిని చదివి షాక్ అయ్యాడు. ‘అతిథులు ప్రతిదానికీ చెల్లించాలని వధువు కోరుతోంది’ అంటూ రెడ్డిట్‌లో ఒక పోస్ట్ చేశారు. ఆ జంట తమ పెళ్లి ఖర్చు 30,000 డాలర్లు (రూ.23.3 లక్షలు)గా తెలిపారు. అయితే పెడిక్యూర్, వెడ్డింగ్ డ్రెస్, వీడియోగ్రఫీ, హనీమూన్‌తో సహా అన్ని ఖర్చులు అతిథులే భరించాలని వధువు స్పష్టం చేసిందన్నారు. ‘ఎలాంటి బహుమతులు వద్దు, అన్ని ఖర్చులకు నిధులివ్వండి’ అని ఆ వెడ్డింగ్ రిజిస్ట్రీ వెబ్‌సైట్‌లో ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Ramsay Hunt Syndrome: కన్ను కొడుతున్నాను అనుకున్నారు.. కానీ చివరకు పక్షవాతం అని తేలింది: నటి
పెళ్లికి అయ్యే ప్రతి ఖర్చుకు చెల్లింపులతోపాటు నగదు ఫండ్, హనీమూన్ ఫండ్ వంటివి అందులో ఉన్నాయని ఆ వ్యక్తి తెలిపాడు. ఒకవేళ ఆ పెళ్లికి 125 మంది హాజరైతే ప్రతి ఒక్కరూ 250 డాలర్లు (సుమారు రూ.20,000) చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే కేవలం యువకులు లేదా పిల్లలు లేని వారు మాత్రమే ఈ ఖర్చును భరించగలరని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైరల్ అయిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించడంతోపాటు పలు సూచనలు చేశారు. మా దగ్గర ఇలా చేస్తే.. ఆ పెళ్లికి ఎవరు రారు.. నాన్ వెజ్ లేకపోతేనే పెళ్లికి వెళ్లకూడదె అనుకునేవారు చాలా మంది ఉంటారు.. ఇలా ఏకంగా పెళ్లి ఖర్చు చెల్లిచమని అడిగితే.. ఇంకేమైనా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bullet Bhaskar Father: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ స్టేజిపై ప్రమాదం.. పడిపోయిన బుల్లెట్ భాస్కర్ తండ్రి!