మన చుట్టూ నిత్యం అనేక వింతలు విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని సృష్టికి విరుద్ధంగా జరిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటిది ఓ ఘటన అందరిని నోరెళ్లబెటేళ్ల చేస్తోంది. అది ఏమిటంటే.. సాధారణంగా మహిళలు గర్భందాల్చుతారు. ఇది సృష్టిలో జరిగే సర్వ సాధారణ విషయం. కానీ పురుషుడు గర్భం దాల్చితే? వినడానికి వింతగా ఉన్న ఇలాంటి వార్తలు గతంలో చూశాం. తాజాగా ఓ వ్యక్తి నిండు గర్భం దాల్చినట్లు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహిళకు వచ్చినట్లే ఆ పురుషుడికి కడుపు వచ్చింది. అతడిని చూసిన జనం షాక్ అవుతున్నారు. ఈ వింత ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్ లోని సౌత్ యార్క్ షైర్ చెందిన 46 ఏళ్ల గ్యారీ యూరియన్ తన భార్య జూలియా తో కలసి జీవిస్తున్నాడు. గ్యారీ చాలా కష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. గర్భం వచ్చినట్లు గా తన పొట్ట ఉబ్బి కనిపిస్తోంది. చుట్టు పక్కల ఉన్న వారు అతడి గర్భం వచ్చిందని అనుకున్నారు. భార్యకు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గ్యారీ పొట్ట రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీంతో గ్యారీ ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అతడి చూసిన జనం ప్రెగ్నంట్ మ్యాన్ అంటూ హేళన చేస్తున్నారు. అందుకే ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ సమస్యపై వైద్యులను సంప్రదించగా అసలు విషయం తెలిసింది.గత ఏడాది ఫిబ్రవరిలో గ్యారీకి అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. నొప్పి ఎక్కువ కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. అతడికి అపెండిసైటిస్ ఉందని రిపోర్టులో తేలింది.
దాన్ని తొలగించేందుకు సర్జరీ వైద్యులు తెలిపారు. కానీ కొన్ని కారణాలు వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈక్రమంలో అపెండిక్స్ లోపలే పగిలిపోయింది. దీంతో గ్యారీకి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చనిపోతాడనుకున్న అతడిని కష్టం మీద బ్రతికించారు వైద్యులు. అపెండిక్స్ సమస్య తొలగిన గ్యారీ కి కొత్త సమస్య వచ్చింది. గ్యారీ పెద్ద ప్రేగు పొత్తి కడుపు గోడ నుంచి బయటకు వచ్చింది. అది క్రమంగా పెరుగుతూ అచ్చం గర్భంలా కనిపిస్తోంది. గ్యారీ పడుతున్న ఇబ్బందులను చూసి.. అతడి భార్య జూలియా ఎంతో బాధపడుతోంది. సర్జరీ చేసి సమస్యను పరిష్కరించ్చు. కానీ కరోనా కారణంగా ఈ ఆపరేషన్ కూడా పదే పదే వాయిదా పడుతోంది. ఎప్పుడు ఈ సమస్యను నుంచి విముక్తి లభిస్తుందా అని గ్యారీ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.