ఆ చీమ కరిచిన చోట విపరీతమైన నొప్పి మొదలైంది. ఎంతలా అంటే.. అతడి తొడపై ఎవరో సలసల కాగే వేడి నూనె పోసినట్లుగా అతడు ఫీలయ్యాడు. దాదాపు ఓ అరగంట పాటు విలవిల్లాడాడు.
సాధారణంగా చీమలు కరిస్తే కొంత నొప్పి రావటం పరిపాటి. ఆ నొప్పి కూడా కరిచే చీమ రకాన్ని బట్టి ఉంటుంది. నల్ల చీమల కంటే ఎర్ర చీమలే ఎక్కువగా మనుషుల మీద దాడులు చేస్తుంటాయి. ఆ ఎర్ర చీమల్లో కూడా కొన్ని డేంజరస్ చీమలు ఉన్నాయి. అవి కరవటం వల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి భయంకరమైన చీమల్లో ‘కౌ కిల్లర్’ రకానికి చెందిన చీమలు ఇంకా ప్రమాదం. ఈ చీమలు కరిస్తే చావు అంచుల దగ్గరి వరకు వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా, ఓ వ్యక్తి కౌ కిల్లర్ చీమ దాడికి గురయ్యాడు. ఆ నొప్పితో విలవిల్లాడిపోయాడు. తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫ్లోరిడాకు చెందిన ఎరిక్ బ్రూయోర్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం తన బైకుపై డావెన్ పోర్టులోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. బైకు దిగి మార్కెట్‌లోకి వెళ్లే మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కుడి తొడపై ఏదో కరిచింది. ఆ నొప్పి తీవ్రంగా ఉండింది. దీంతో అతడు బలంగా తన తొడపై చేత్తో కొట్టాడు. ఓ చీమ ప్యాంటు లోంచి బయట పడింది. అది చాలా పెద్దగా ఉంది. మామూలు చీమలకంటే పెద్దగా ఉంది. ఆ చీమను చూసి ఎరిక్ ఆశ్చర్యపోయాడు. అది కరిచిన చోట నొప్పి విపరీతంగా ఉండటంతో బాధతో విలవిల్లాడిపోయాడు. తన తొడపై ఎవరో వేడి నూనె పోసినట్లుగా అతడు ఫీలయ్యాడు. 2020లో జరిగిన ఈ అనుభవాన్ని తాజాగా, తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
దీంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు ‘‘ ఆ చీమను కౌ కిల్లర్ చీమ అంటారు. దానికి వెల్వెట్ చీమ అని కూడా పేరుంది. ఇవి నార్త్ అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరిడాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి కరిచిన చోట చాలా నొప్పిగా ఉంటుంది. వేడి నూనె ఒంటిపై పోసినట్లుగా ఉంటుంది. ఈ చీమలు మనుషులపై దాడి చేయవు. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ కవ్ కిల్లర్ చీమపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.