USA MORRIS PARK, BRONX: అమెరికాలోని బ్రోన్క్స్ సిటీ, మోరిస్ పార్క్ కమ్యూనిటీ వద్ద రోడ్డు మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది. దీంతో అక్కడే పార్క్ చేసిన ఉన్న వ్యాను ఆ పెద్ద రంధ్రంలో పడిపోయింది. అర్ధరాత్రి సమయంలో పార్కింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అందరూ చూస్తుండగా రోడ్డు విరిగిపోయి పెద్ద గొయ్యిలో పడిపోయింది. మొదట వ్యాన్ యొక్క వెనుక టైర్ గొయ్యిలో పడింది. ఆ తర్వాత వ్యాన్ పూర్తిగా గొయ్యిలో పడిపోయింది. ఈ వ్యాన్ ముందు ఒక కారు కూడా ఉంది. ఆ కారు కూడా కొంచెం ఉంటే ఈ గొయ్యిలో పడిపోయేదే, కానీ అదృష్టవశాత్తు పడలేదు.
ఇదంతా స్థానిక టీవీ ఛానల్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎఫ్డిఎన్వై(FDNY) అఫీషియల్స్ వెల్లడించారు. రాత్రంతా రెస్క్యూ సిబ్బంది అక్కడే ఉన్నారని బోరో ప్రెసిడెంట్ “వనెస్సా గిబ్సన్” అన్నారు. 75 మంది నీటి సదుపాయం లేక ఇబ్బంది పడ్డారని ఆమె అన్నారు. అంతేకాదు తన జీవితంలో ఇంత పెద్ద రంధ్రం ఎప్పుడూ చూడలేదని ఆమె ట్వీట్ చేశారు. సిటీ ఆఫీషియల్స్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై పర్యావరణ పరిరక్షణ విభాగం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Thanks to our city officials for responding to today’s massive sinkhole in our Morris Park community. I have never seen a sinkhole so big in my life. Work crews remain on scene overnight, 75 customers w/o water and all vehicles have been removed. No injuries. Updates to follow. pic.twitter.com/VMUaj6XFAF
— Hon. Vanessa L. Gibson, MPA (She, Her, Hers) (@Vanessalgibson) July 19, 2022
బ్రోన్క్స్ సిటీలో భారీగా కురిసిన వర్షాల కారణంగా ఈ హోల్ ఏర్పడలేదని, ఇది పర్యావరణానికి సంబంధించిన రంధ్రం కాదని పర్యావరణ విభాగం తెలిపింది. గొయ్యిలో పడిన ఆ వ్యాన్ ను బయటకు తీయడానికి 18 చక్రాల వాహనంతో పర్యావరణ పరిరక్షణ విభాగానికి చెందిన సిబ్బంది అక్కడికి చేరుకుని వ్యాన్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన దివ్యాంగుడు.. పోలీసులకి చుక్కలు..
ఇది కూడా చదవండి: RGVతో డాన్స్ చేశానని నా కుటుంబం నన్ను ద్వేషిస్తోంది: ఇనయ సుల్తానా