ఓ మధ్యతరగతి కుటుంబం రోజు గడవాలంటే.. సుమారుగా 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా బయటకు వెళ్లి సరదాగా గడిపితే.. 1000-2000 పైనే ఖర్చవుతుంది. ఇక మధ్యతరగతి ఇళ్లల్లో పండగలు, పబ్బాలు, బర్త్‌డేలు వంటి ప్రత్యేక సందర్భాల్లోనే షాపింగ్ ఖర్చు ఉంటుంది. దానికి కూడా ఏడాది అంతా పొదుపు చేసిన డబ్బే ఉపయోగపడుతుంది. కానీ బడా బాబులు, డబ్బులున్న వాళ్ల సంగతి అలా కాదు. ప్రతి రోజు వేలల్లో, లక్షల్లో ఖర్చు చేస్తారు. అయితే ఎంతటి ధనవంతుడైనా సరే.. రోజుకు సుమారు అరకోటి ఖర్చు చేయడం అంటే మాటలు కాదు.. మాములుగా చేయరు కూడా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే యువతి మాత్రం రోజుకు 40 లక్షల రూపాయలు అవలీలగా.. మంచి నీరు తాగినంత ఈజీగా ఖర్చు చేస్తుంది. పైగా నేను ఖర్చు చేయడానికే పుట్టాను అంటుంది. ఆమె రోజు వారి దినచర్యను, ప్రతి రోజు చేసే ఖర్చును వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. వాటికి మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. చాలా మంది నెటిజనులు.. రాచ కుటుంబంలో పుట్టిన వాళ్లు.. కూడా మరీ ఈ రేంజ్‌లో ఖర్చు చేయరు కదా అని కామెంట్స్ చేస్తారు. ఆ వివరాలు..
అమెరికా, న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే యువతి ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతుంది. తనను తాను ఇంట్లో ఉండే కుమార్తెగా చెప్పుకోవడానికి రోమా ఏమాత్రం ఇబ్బంది పడదు. ఆమె రోజు వారి పాకెట్ మీన అమెరికన్ కరెన్సీలో 50 వేల డాలరు. ఇండియన్ కరెన్సీలో సుమారు 40 లక్షల రూపాయలు. రోమా తన దినచర్య ఎలా ప్రారంభమవుతుంది.. ఏం చేస్తుంది వంటి వివరాలను వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. ఈ వీడియోలను లక్షల మంది చూస్తారు.
ఒక వీడియోలో రోమా తన దినచర్య గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘‘నేను ఉదయం లేచి జిమ్‌కి వెళ్తాను. ఆ తర్వాత నా స్నేహితురాళ్లతో కలిసి షాపింగ్‌కు వెళ్తాను. ఇందు కోసం నేను ప్రతి రోజు 52 వేల డాలర్లు ఖర్చు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. మరో వీడియోలో ఐబ్రోస్ చేయించుకోవడం కోసం ఏకంగా 600 డాలర్లు ఖర్చు చేసినట్లు పర్కొంది. అంటే మన కరెన్సీలో 47, 430 రూపాయలు. ఈ వీడియోలు చూసిన జనాలు.. యువరాణులు సైతం నిన్ను చూస్తే అసూయపడతారు.. నీ తల్లిదండ్రులు నిన్ను డబ్బులు ఖర్చు చేయడానికే కన్నారు… లైఫ్ అంటే నీది అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే రోమా కేవలం ఇలా తన సొంతానికే కాకుండా.. పలు స్వచ్ఛంద సంస్థలకు డబ్బును విరాళంగా ఇస్తుంది. ‘‘పాలస్తీనియన్, ఇజ్రాయెల్ పిల్లలకు అరబిక్, హిబ్రూ బోధించే ఇజ్రాయేల్ పాఠశాలలంటే నాకు చాలా ఇష్టం. నేను జమైకాలోని ఒక పాఠశాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను’ అని తెలిపింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.