రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్ వణుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికన్ సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ..”రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో భయపడతోంది. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత్వం కనిపిస్తోంది. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయడంలో భారత్ కొంతవరకు జంకుతోంది. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. భారత్ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉంది” అని అమెరికా ప్రెసిడెంట్ పేర్కొన్నారు.క్వాడ్(QUAD) లో సభ్యదేశమైన భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని.. మిగిలిన సభ్యదేశాలైనా జపాన్, ఆస్ట్రేలియా, తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని జో బైడెన్ తెలిపారు. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. అయితే రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్న భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అలాగనీ అటు యుద్ధాన్ని కూడా సమర్థించడం లేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతోందని జోబైడెన్ పేర్కోన్నారు. మరి.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.