అదృష్టం ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. మనం చేయాల్సిందిల్లా.. అదృష్టం రాకను గుర్తిస్తే.. చేతులు చాచి ఆహ్వానించాలి. ఇదే పని చేసింది ఓ మహిళ. మెయిల్ లో స్పామ్ మెయిల్ కోసం వెతుకున్న మహిళకు తాను లాటరీలో 3 మిలియన్లు (రూ. 22,32,61,350)గెలిచినట్లు వచ్చిన మెయిల్ కనిపించింది. ఇక సదరు మహిళ సంతోషం గురించి వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఆ వివరాలు..
అమెరికా, ఓక్లాండ్ కౌంటీకి చెందిన లారా స్పియర్స్ MichiganLottery.comలో డిసెంబర్ 31 మెగా మిలియన్స్ డ్రాయింగ్ కోసం టిక్కెట్ కొనుగోలు చేసింది. ఇక లారా కొన్న టికెట్ డిసెంబర్ 31న జరిగిన డ్రాలో మ్యాచ్ అయినట్లు మిచిగాన్ లాటరీ తెలిపింది. అంతేకాక లారా అదృష్టం ఏంటంటే.. అప్పటి వరకు 1 మిలయన్ డాలర్లుగా మాత్రమే ఉన్న ప్రైజ్ మనీని 3 మిలియన్ డాలర్లకు పెంచినట్లు సదరు సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా లారా మాట్లాడుతూ.. ‘‘కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా నాకు ఈ లాటరీ టికెట్ గురించి తెలిసింది. నేను ఓ టికెట్ కొన్నాను. కానీ ఆ తర్వాత దాని గురించి మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఓ మెయిల్ గురించి నా స్పామ్ మెయిల్ లో వెతుకుతుండగా.. లాటరీ కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ నా కంటపడింది. దాన్ని ఒపెన్ చేసి చూడగా.. నేను లాటరీ టికెట్ గెలిచినట్లు దానిలో ఉంది. తొలుత నేను దీన్ని నమ్మలేదు. తర్వాత ఆ సైట్ లోకి వెళ్లి.. నా టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూడగా.. నేను కొన్న టికెట్ కు లాటరీ తగిలనట్లు తెలిసింది’’ అని తెలిపింది.
తనకు వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని తన కుటుంబ సభ్యులకు ఇస్తానని.. జాబ్ కు రిజైన్ చేసి.. తనకు నచ్చిన వ్యాపారం చేస్తానని తెలిపింది లారా. మహిళకు అందివచ్చిన ఈ అదృష్టం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.