డ్రగ్స్ వల్ల తాత్కలిక ఉపశమనం లభిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలు దారుణంగా ఉంటాయి. కొన్ని సార్లు వాటికి చికిత్స కూడా లభించదు. తాజాగా అమెరికాను ఓ డ్రగ్ వణికిస్తోంది. అదే జాంబీ డ్రగ్..
కొన్ని రోజలు క్రితం అమెరికాలో వెలుగు చూసిన వీడియోలు కొన్ని ప్రపంచాన్ని భయపెట్టాయి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు కనీసం నిలబడలేకుండా.. తూలి పోతు ఉన్నారు. వారి చర్మం మీద భయంకరమైన గాయాలు కనిపించాయి. ఇక తాజాగా ఈ వీడియోలకు సంబంధించి ఓ వార్త భయాందోళనలు కలిగిస్తోంది. వీడియోలోని వ్యక్తులు అలా ప్రవర్తించడానికి కారణం ఓ డ్రగ్ అని తెలిసింది. జైలాజీన్ అనే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా.. ప్రజలు ఇలా ప్రవర్తిస్తున్నారని.. వారి శరీరం మీద చర్మం కుళ్లిపోయి.. జాంబీల మాదిరిగా కనిపించారు. ఈ డ్రగ్‌నే ట్రాంక్ అని కూడా అంటారు. ఈ జైలాజిన్ డ్రగ్ ప్రస్తుతం అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది.
తాజాగా ఈ డ్రగ్ గురించి టైమ్ మ్యాగజైన్‌లో ఓ నివేదిక వచ్చింది. దీని ప్రకారం జైలాజీన్ డ్రగ్‌ను కేవలం జంతువుల మీద మాత్రమే వినియోగించాలి. జంతువులను అపస్మారక స్థితికి తీసుకురావడానికి ఈ డ్రగ్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఉంది. మానవులు మీద ఈ డ్రగ్ తీవ్ర ప్రభావం చూపుతుంది.. అసలు వాడకూడదు. అయితే అమెరికాలో చాలా మంది దీన్ని మధ్యస్థం నుంచి తీవ్రమైన ఒంటి నొప్పులను తగ్గించుకునేకుందు హెరాయిన్ మాదిరిగా అధికంగా వినియోగిస్తున్నారని టైమ్స్‌లో వచ్చిన నివేదిక వెల్లడించింది.
ఈ జైలాజిన్ డ్రగ్ మొదట ఫిలడెల్ఫియాలో పట్టుకున్నారని, ఆ తర్వాత అది శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ మీదుగా దేశంలోని వివిధ నగరాల్లోకి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం అమెరికాలో దీని వినియోగం పెరిగింది. ఇక జంతువులకు వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన ఈ జైలాజిన్.. మనుషులకు సురక్షితం కాదు. దీన్ని అధిక మోతాదులో తీసుకున్న వారికి రివర్స్ చికిత్సలో ఇచ్చే నాలోక్సోనక్ కూడా స్పందించదు అని నివేదిక వెల్లడించింది.
ఇక ఈ డ్రగ్ ప్రభావం అనస్థీషియా మాదిరిగానే ఉంటుంది. దానిని తీసుకునే వ్యక్తికి నిద్ర రావడం మొదలవుతుంది, శ్వాస మందగిస్తుంది. దాంతో అతడి చర్మం ఉబ్బి, గాయాలు అవుతాయి. అయితే ఈ డ్రగ్‌ను పదే పదే వినియోగిస్తే.. గాయాలు మరింత పెరిగి.. చివరకు ఆ వ్యక్తి చర్మం చాలా వరకు కుళ్ళిపోయే స్థితికి వస్తుంది. ఇది చికిత్సకు లొంగకపోవడంతో.. చివరకు ఆయా అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికాలో ఈ డ్రగ్ వినియోగం పెరగడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే దేశవ్యాప్తంగా ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటంతో.. ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Brooo, what’s happening in the USA🙆🏽♂️💀? pic.twitter.com/hUJCjZ5Xlx
— Oyindamola🙄 (@dammiedammie35) December 6, 2022