లవర్స్ అన్నాక చిన్నచిన్న అలకలు, గొడవలు సహజం. అవి ఉంటేనే.. అసలు మజా. కోప్పడితే.. బుజ్జగించడం, సారీలు చెప్పడం, నాన్నా బంగారం అంటూ బ్రతిమలాడటం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద కథేలేండీ. ఈ తతంగమంతా.. ఇండియన్ స్టైయిల్. అమెరికా కుర్రాడు ఇందుకు విరుద్ధం. ఇదంతా మీరు చేస్తారేమో. నా రూటే సపరేటు. బుజ్జగించడం మా ఇంటా వంటా లేదు. నాలుగు పీకడమే నా రూటు అనుకున్నాడు. చివరకు ఏమీ చేయలేక.. జుట్టు పీక్కుంటూ అందినకాడికి పగలకొట్టాడు. దీని ఫలితంగా భారీ నష్టం వాటిల్లింది.
జంట అన్నాక చిన్నాచితక గొడవలు అవుతుంటాయి. దాని వల్ల పెద్ద నష్టం జరగదు. కానీ అమెరికాలో ఓ జంట మధ్య జరిగిన గొడవ భారీ నష్టానికి దారి తీసింది. ఆ నష్టం వేలల్లో కాదు కోట్లలో సంభవించింది. ఈ ఘటన అమెరికాలోని ‘డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ లో చోటుచేసుకుంది. డల్లాస్ మ్యూజియాన్ని చూసేందకు బ్రియాన్ హెర్నాండెస్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చాడు. అక్కడ వారిద్దరి మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన హెర్నాండెజ్ చుట్టు పక్కల వస్తువులను పగలగొట్టడం ప్రారంభించాడు. వెంటనే స్పందించిన మ్యూజియం. యాజమాన్యం అతడిని ఆపి పోలీసులకు అప్పజెప్పింది.
Dallas Police say 21-year-old Brian Hernandez broke into the @DallasMuseumArt and damaged $5Million in ancient Greek art. Court docs say he told a witness “he was mad at his girl so he broke in…”
Art📸Courtesy @DallasMuseumArt website
💻https://t.co/uIqOZkPO9Z pic.twitter.com/1ulIKEv1b2— Steven Dial (@StevenDialFox4) June 2, 2022
ఇది కూడా చదవండి: USA: 20 ఏళ్ల తర్వాత తల్లీకొడుకును కలిపిన ఫేస్ బుక్!
పోలీసుల వివరాల ప్రకారం.. తొలుత ఆ యువకుడు స్టీల్ కుర్చీతో మ్యూజియం గ్లాస్ డోర్ పగులగొట్టాడు. అనంతరం అక్కడి డిస్ ప్లే కేసులను ధ్వంసం చేసేందుకు ఓ స్టూల్ ఉపయోగించాడు. ఈ క్రమంలో 2,500 ఏళ్లనాటి పురాతన గ్రీకు కళాఖండాలను నాశనం చేశాడు. ఇందులో లక్ష డాలర్ల విలువైన ఓ గ్రీకు కూజా ఉంది. 10 వేల డాలర్ల విలువైన ఓ నేటివ్ అమెరికన్ కళాఖండం, రెండు విలువైన కుండలతో సహా అనేక పురాతన వస్తువులను నాశనం చేశాడు. మొత్తంగా హెర్నాండెజ్ దాదాపు 5 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.38.88 కోట్ల విలువైన ఆస్తి నష్టానికి పాల్పడ్డాడు అని పోలీసులు చెప్పుకొచ్చారు. చూశారుగా.. ప్రియురాలితో గొడవ ఎంత నష్టానికి దారితీసిందో.. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.