వాయుసేన అధికారుల అలసత్వం కారణంగా దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బాధిత కుటుంబాలకు 230 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని (రూ. 17,20,67,60,000) చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ఘటనలో 60 శాతం బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. ఆ వివరాలు..
అమెరికా వాయుసేన మాజీ ఎయిర్‌మెన్ డెవిన్ పాట్రిక్ కెల్లీ 2017, నవంబర్ లో టెక్సాస్ లోని ఓ చర్చిలో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో సుమారు 26 మంది మృతి చెందగా.. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అమెరికా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. టెక్సాస్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. జనాలపై కాల్పుల అనంతరం కెల్లీ తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
ఇది కూడా చదవండి : పెయింటింగ్ తెచ్చిన అదృష్టం! ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు!
ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కెల్లీ గురించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కెల్లీపై గతంలో గృహ హింస ఆరోపణలు రుజువయ్యాయయని.. అంతేకాక అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది. ఇక కెల్లీ దుష్ప్రవర్తన కారణంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ 2014లోనే అతడిని విధుల నుంచి తొలగించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఈ క్రమంలో ఫెడరల్ చట్టాల ప్రకారం అతడికి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అధికారం లేదు. అయితే అమెరికా వాయుసేన కెల్లీ గురించిన నేర సమాచారాన్ని డేటాబేస్ లో నమోదు చేయలేదు. ఫలితంగా అతడికి చట్టబద్ధంగా ఆయుధాలను కొనుగోలు చేసే అవకాశం లభించింది. ఫలితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి : నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్న బిచ్చగత్తె..
కెల్లీ నేర ప్రవృత్తి గురించి తెలియడంతో బాధిత కుటుంబాలు అమెరికా ప్రభుత్వంపై దావా వేశాయి. దీనిపై విచారణ చేపట్టిన టెక్సాలోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జేవియర్ రోడ్రిగ్జ్ ఈ దారుణంలో కెల్లీది 40 శాతం తప్పయితే.. ప్రభుత్వ బాధ్యత 60 శాతం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా వాయుసేన బాధిత కుటుంబాలకు సుమారు 1720 కోట్ల రూపాయలకు పైగా నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.