చేతిలో గన్ ఉందా.. టప్ మని కాల్చడమే. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇలాంటి సీన్లు. తెలుగు సినిమాల్లో యాక్షన్ తక్కువ కానీ, హాలీవుడ్ సినిమాలు అన్నీ ఆ కోవకు చెందినవే. టప్.. టప్.. అని బుల్లెట్లు నీళ్లలా పారుతుంటాయి. అలాంటి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసే పిల్లల చేతుల్లోకి గన్ వస్తే ఊరుకుంటారా..! ఇంటిల్లిపాదిని యాక్షన్ లోకి దించుతారు. ఈ కథనంలో ఓ ఆరేళ్ళ చిన్నారి అలాంటి ప్రయత్నమే చేసింది..
మన దేశంలో సర్టైన్ ఏజ్ వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడం పరిపాటి. అదే అమెరికాలో అయితే సర్టైన్ ఏజ్ వచ్చాక గన్ లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఇది వారి చేతుల్లోకి వచ్చాక వాడకం ఎలా ఉంటుందంటే.. ‘పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లే. ఎప్పుడు, ఎవరిమీద విసిరేస్తాడో తెలియదు. వాడే కొట్టుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ కోవకు చెందిన వార్తలు ఇప్పటికే ఎన్నో విన్నాం.. ‘స్కూల్లో కాల్పులు జరిపిన విద్యార్ధి’, ‘తండ్రిపై ఆవేశంతో కాల్పులు జరిపిన కొడుకు’ ఇలాంటి ఘటనలు అమెరికాలో నిత్యం చోటుచేసుకునేవే. తాజాగా, ఆ కోవకు చెందిన ఘటన మరొకటి వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారి తన అమ్మమ్మను హాలీవుడ్ రేంజ్ లో టప్ మని కాల్చింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. 57 ఏళ్ల మహిళ, ఆరేళ్ళ చిన్నారి ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు. సదరు మహిళ ఆ చిన్నారికి అమ్మమ్మ. ఆమె ముందు సీటులో కూర్చొని కారు డ్రైవర్ చేస్తోండగా, చిన్నారి వెనుక సీట్ లో కూర్చొని ఆడుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారికి వెనుక సీట్ కింద దాచిన తుపాకీ దొరికింది. దానిని చేతికి అందుకున్న బాలిక అటూ.. ఇటూ తిప్పుతూ ఆడుకునే ప్రయత్నం చేయడంతో అది టప్ మని పేలింది. అంతే.. ఒక్కసారిగా బుల్లెట్ ముందు సీట్లో కూర్చున్న అమ్మమ్మ శరీరంలో నుండి దూసుకుపోయింది. అయితే, బుల్లెట్ మహిళ నడుము కింది భాగంలో నుండి చొచ్చుకుపోవడంతో ఎలాంటి విషాదం చోటుచేసుకోలేదు.
ఈ ఘటన జరిగాక కూడా సదరు మహిళ ఇంటి వరకు కార్ డ్రైవ్ చేయడం గమనార్హం. అనంతరం ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె యూఎస్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 911కి కాల్ చేసింది. అక్కడికి చేరుకున్న సహాయసిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై మాట్లాడుతూ.. బుల్లెట్ నడుము కింది భాగంలో చొచ్చుకుపోవడంతో ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించారు వెల్లడించారు. అలాగే, సదరు బాలికను కూడా ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ ఘటన వల్ల చిన్నారి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. కావున.. పాశ్చాత్య దేశాల్లో ఉన్న తెలుగువారు ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం..
Shooting Investigation involving a child. pic.twitter.com/YI2OhNEzTd
— North Port Police (@NorthPortPolice) February 17, 2023