రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఈ రోజు ఉదయమే మొదలైన యుద్ధం. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని చాలా నగరాలపై బాంబులతో విరుచుకుపడుతూ ఆక్రమించేశాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో బెలారస్ సరిహద్దుల గుండా రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి ప్రవేశించాయి.
ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను టార్గెట్ చేసింది రష్యా. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ప్రకటించిన నాలుగు గంటల వ్యవధిలోనే… ఉక్రెయిన్ లోని 13 ప్రధాన నగరాలపై రష్యా దాడి చేసింది. కీవ్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్నాయి. తాజాగా రష్యా కి సంబంధించిన 5 ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఉక్రెయిన్.
రష్యా బలగాల దాడికి ప్రతిదాడిగా రష్యా ఫైటర్ జెట్ ను కూల్చేవేయడంతో ఇప్పుడు ఉక్రెయిన్ కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ స్థానిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నట్టు రష్యా అధ్యక్షులు పుతిన్ తెలిపారు. ఎక్కడా జనావాసాలపై దాడులు చేయడం లేదని ఆయన అన్నారు.