వాసన చూసే ఉద్యోగం. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఉద్యోగం. ఈ ఉద్యోగంలో భాగంగా వాసన చూస్తే చాలు నెలకు లక్షన్నర జీతం ఇస్తారు. ఇంతకే ఏంటా ఉద్యోగం? దేని వాసన చూడాలి?
క్వాలిటీ చెకింగ్ అనేది ప్రతీ కంపెనీల్లోనూ వీడియో గేమ్ కంపెనీలు గేమ్స్ తయారు చేసే క్రమంలో గేమ్ టెస్టర్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ గేమ్స్ ఆడి లోపాలు ఏమైనా ఉంటే కంపెనీకి చెప్పాలి. దీని కోసం మంచి ప్యాకేజ్ ఇస్తారు. ఇలానే కొన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తయారు చేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాయి. దీని కోసం క్వాలిటీ ఇన్స్పెక్టర్లను నియమిస్తాయి. తాజాగా ఒక న్యూట్రిషన్ బ్రాండ్ సరికొత్త ఉద్యోగాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే తొలి పూమ్మెలియర్ అనే కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. యూకేకి చెందిన న్యూట్రిషన్ బ్రాండ్ తమ మొదటి పూమ్మెలియర్ ఉద్యోగి కోసం ఎదురుచూస్తుంది.
ఇంగ్లాండ్ లోని స్ట్రౌట్ నగరంలో ఉన్న ఓ కంపెనీ ఈ ఉద్యోగం కోసం ఒక్కొక్కరికి 1500 పౌండ్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. మన కరెన్సీ ప్రకారం రూ. 1.48 లక్షలు చెల్లిస్తుంది. ఈ జీతం కూడా ట్రైనింగ్ పీరియడ్ లో ఇచ్చేది. అనుభవం వస్తే జీతం పెరుగుతుంది. ఇంతకే ఆ ఉద్యోగం ఏంటంటే.. మలం వాసన చూడడం. అవును మీరు విన్నది కరెక్టే. మలం వాసన చూడడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏమైనా వస్తున్నాయో లేదో తెలుసుకోవడమే పని. మలం వాసన ద్వారా సదరు వ్యక్తులకి ఉన్న పోషకాహార లోపం ఏమిటో అనేది గుర్తిస్తారు. దీని కోసం మంచి ముక్కు కలిగిన వ్యక్తులను గల్ట్ హెల్త్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ చూస్తుంది. ఈ ట్రైనీలకు భారీగా జీతం ఇచ్చేందుకు రెడీగా ఉంది.
అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునేవారు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కలిగి ఉండాలి. మార్చి 2023 నుంచి పూమ్మెలియర్ ఉద్యోగానికి సంబంధించిన శిక్షణ మొదలవుతుంది. డిస్బయోసిస్ అని పిలువబడే గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు మీథేన్ వాయువు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది. లాక్టోజ్ ఇంటోలరెన్స్, పలు గట్ ఇన్ఫెక్షన్లు, ప్రేగు సంబంధిత వ్యాధులు వంటివి మల విసర్జన సమయంలో బాగా దుర్వాసనకు కారణమవుతాయని కంపెనీ తెలిపింది. పూమ్మెలియన్ ద్వారా ఏ వ్యక్తికి ఏ లోపం ఉందో అనే విషయాన్ని చెప్తామని కంపెనీ తెలిపింది. మరి మలం వాసన చూసే ఉద్యోగాన్ని సృష్టించిన ఈ కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
UK firm seeks to train people to smell poop,
to pay them ₹1.48 lakh#UK #poommelier #Viral #News pic.twitter.com/3E32ZqxeSn— StockMarket Grow (@Shrikant_Chetry) February 26, 2023