మనం నిత్యం బస్సులలో సీటు కోసం, రోడ్లమీద, బస్టాండ్లలో ప్రయాణికులు ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తుంటాం. చిన్నగా మొదలైన గొడవ మాటకు మాట పెరిగి ఒకరినొకరు పెద్దగా తిట్టుకుని, చివరకు కొట్టుకునే వరకు వెళ్తారు. తాజాగా అలాంటి ఘటన అమెరికాలోని ఓ విమానశ్రయంలో చోటు చేసుకుంది.
మనం నిత్యం బస్సులలో సీటు కోసం, రోడ్లమీద, బస్టాండ్లలో ప్రయాణికులు ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తుంటాం. చిన్నగా మొదలైన గొడవ మాటకు మాట పెరిగి ఒకరినొకరు పెద్దగా తిట్టుకుని, చివరకు కొట్టుకునే వరకు వెళ్తారు. ఇలాంటి సంఘటనలు మనం అనేకం చూశం. కానీ ఎయిర్ పోర్టులో కొట్టుకోవడం, తిట్టుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. అదికూడా అమెరికా వంటి దేశంలో ఇంకా అరుదుగా జరుగుతాయి. అయితే అమెరికాలోని ఓ ఎయిర్ పోర్ట్ లో మహిళలు పిచ్చ కొట్టుడు కొట్టుకున్న ఘటన జరిగింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
అమెరికా చికాగోలోని ఓ’హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో సుమారు 12 మంది వరకు గొడవకు దిగారు. అందులో మొదట ఓ 24 ఏళ్ల యువతిపై మరో ఇద్దరు యువతులు దాడికి దిగారు. జుట్లు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకుంటూ, నేలపై దొర్లుతూ విచక్షణా రహితంగా వ్యవహరించారు. సోమవారం డిప్లానింగ్ చేస్తున్నపుడు బ్యాగేజీ క్లెయిమ్ ప్రాంతంలో చిన్న మాటకు మాట పెరిగి వారి మధ్య గొడవ జరిగింది. పోలీసులు క్రిస్టోఫర్ హాంప్టన్(18), టెంబ్రా హిక్స్(20) అనే ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.
ఈ గొడవ తర్వాత చికాగో విమానాశ్రయ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం విమానాశ్రయ వర్గాలకు ముఖ్యమని ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ ఘటనతో చాలా సమయంలో పాటు విమానాశ్రయంలో గందర గోళం ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా చూశారు. యువతుల గొడవలను చూసి తోటి ప్రయాణికులు పిచ్చ నవ్వులు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd
— Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023