టెక్ ప్రపంచంలో భారతీయుల హవా కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీలను ముందుకి నడపడానికి భారతీయులకి సత్తా ఉందని భారతీయ మేధావులు ఋజువు చేస్తున్నారు. గూగుల్ కి ఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కి ఓ సత్యనాదెళ్ల.. ఇప్పుడు ట్విట్టర్ కి ఓ పరాగ్ అగర్వాల్! అవును నిజమే.. ఇప్పుడు ట్విట్టర్ కొత్త సీఈఓగా ఓ భారతీయుడు నియమితుడయ్యాడు. ఇది దేశం గర్వించతగ్గ విషయం. కానీ.., ఈ ప్రయాణం ఓ ప్రస్థానంగా మారడం వెనుక, ఈ ఉద్యోగం ఒక జాతి గర్వంగా మారడం వెనుక ఓ దశాబ్ద కాలం పాటు సాగిన కష్టం దాగుంది.
Indian Origin Parag Agrawal to take over as CEO of Twitter.
And now:
Twitter- Parag Agarwal
Google – Sundar Pichai
Microsoft – Satya Nadella
IBM – Arvind Krishna
Adobe- Shantanu Narayen
VMWare – Raghu Raghuram pic.twitter.com/zItL2C96Bn— Awanish Sharan (@AwanishSharan) November 30, 2021
పరాగ్ అగర్వాల్ గురుంచి తెలుసుకునే ముందు.. మనం ట్విట్టర్ నేపధ్యం గురించి కూడా కాస్త తెలుసుకోవాలి. సోషల్ మీడియా అప్పుడుడప్పుడే సాధారణ ప్రజలకి చేరువవుతున్న తరుణంలో ట్విట్టర్ పుట్టుకొచ్చింది. జాక్ డోర్సీ, ఇవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్, నోహ్ గ్లాస్ అనే నలుగురు వ్యక్తులు ఫౌండర్స్ గా, 2006 మార్చ్ 21న శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ట్విట్టర్ ప్రాంభమైంది. నిజానికి ట్విట్టర్ అందుబాటులోకి వచ్చే సరికి సోషల్ మీడియా మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు.
అప్పటికి 4 సంవత్సరాలు ముందే మార్కెట్ లోకి వచ్చిన లింక్డిన్, 2 సంవత్సరాల ముందే మార్కెట్ లోకి వచ్చిన ఫేస్ బుక్ సోషల్ మీడియా మార్కెట్ ని పూర్తిగా ఆక్రమించేసి ఉన్నాయి. కానీ.., ట్విట్టర్ మాత్రం ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగింది. దీనికి కారణం.. ట్విట్టర్ యూజర్ ఫ్రెండ్లి నెస్ మాత్రమే కాదు, సెక్యూరిటీ విషయంలో కూడా ట్విట్టర్ టాప్ కాబట్టి. దీంతో.., సెలబ్రటీలు అంతా ట్విట్టర్ కి క్యూ కట్టారు. వారి వెంటే సాధారణ ప్రజలు ట్విటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ట్విట్టర్ ఇంత ప్రస్థానం సాగించడంలో మాజీ సీఈఓ జాక్ డోర్సీ పాత్ర వెల కట్టలేనిది. కానీ.., పరాగ్ అగర్వాల్ ఏదో రాత్రికి రాత్రి సీఈఓ కుర్చీలో కూర్చోలేదు. ట్విట్టర్ అభివృద్ధి సాధించిన ఈ దశాబ్దకాల ప్రయాణంలో పరాగ్ అగర్వాల్ పాత్ర కూడా వేల కట్టలేనిది. పరాగ్ అగర్వాల్ 2011 నుండి ట్విట్టర్ లో వివిధ విభాగాల్లో పని చేస్తూ, ఇప్పుడు సీఈఓ అయ్యారు. అసలు ఆ ప్రయాణం ఎలా మొదలైందో తెలియాలంటే.. పరాగ్ అగర్వాల్ జర్నీ గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకోవాల్సిందే.
Indian-Origin Parag Agrawal To Replace Jack Dorsey As Twitter CEO https://t.co/2D8JVUKZvp pic.twitter.com/92kURhm4kJ
— NDTV (@ndtv) November 29, 2021
పరాగ్ అగర్వాల్ 1983లో ముంబైలో జన్మించారు. పరాగ్ చిన్ననాటి నుండి చదువులో టాప్ ర్యాంకర్ ఏమి కాదు. కానీ.., ఏదైనా నచ్చితే మాత్రం దాని మూలాల సైతం తెలిసే వరకు వదిలిపెట్టే వారు కాదు. ఈ ఆసక్తి పరాగ్ ని టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసింది. ఇక పరాగ్ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తరువాత పై చదవుల కోసం అమెరికా చేరుకున్నారు. అక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ.. 2011లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుండి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
పరాగ్ ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో రీసెర్చి చేశారు. ఈ రీసెర్చ్ పరాగ్ ని మిగతా వారికన్నా జీనియస్ గా మార్చింది. ఓ సాధరణ యూజర్ ఎలాంటి అంశాలను కోరుకుంటాడన్న మినిమమ్ నాలెడ్జ్ ఉంటే చాలు.. సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టించవచ్చని పరాగ్ అగర్వాల్ బలంగా నమ్మేవారు. ఆయన తన రీసెర్చ్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అప్పటి ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ కి పైకి సింపుల్ కనిపిస్తున్న ఈ లాజిక్ ఎంత కష్టమైనదో, ఎంత అవసరమైనదో స్పష్టంగా అర్ధం అయ్యింది. వెంటనే ఆయన పరాగ్ అగర్వాల్ కి ట్విట్టర్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ ఆఫర్ చేశారు.
2011 నుండి 2018 వరకు పరాగ్ సాధారణ ఇంజినీర్ గా మాత్రమే ట్విట్టర్ లో పని చేశారు. కానీ.., 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మొత్తం ప్రయాణంలో పరాగ్ అగర్వాల్ ట్విటర్ టెక్నికల్ స్ట్రేటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కంజ్యూమర్, రెవెన్యూ, సైన్స్ టీమ్స్‌ల బాధ్యతలు చూసుకుంటూ అన్నీ విషయాల్లో రాటుదేలాడు. కంపెనీ కోసం ఇంత కష్టపడ్డాడు కాబట్టే ట్విట్టర్ సీఈఓ పోస్ట్ ఇప్పుడు పరాగ్ అగర్వాల్ ని వెతుక్కుంటూ వచ్చింది.
పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమితుడైన విధానం కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఏదో నాటకీయ పరిణామాల మధ్య, తప్పనిసరి పరిస్థితిల్లో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓ కాలేదు. అన్నీ అర్హతలు సాధించే ఆయన సీఈఓ అయ్యాడు. దీంతో మాజీ సీఈఓ జాక్ డోర్సీ కూడా పరాగ్ అగర్వాల్ పై ప్రశంసలు కురిపించాడు. ” పరాగ్ పై నాకు నమ్మకం ఉంది. అతను కంపెనీ ఎదుగుదలలో ముందు నుండి కష్టపడ్డాడు” అంటూ.. మంచిగా స్వాగతం చెప్పాడు జాక్ డోర్సీ. దీని కారణంగానే.. పరాగ్ అగర్వాల్ అయిన తొలిరోజే కంపెనీ షేర్ వ్యాల్యూ 10 శాతం పెరిగింది. ఇది ఒక రకంగా శుభ పరిణామం అనే చెప్పుకోవచ్చు.
ఇక పరాగ్ అగర్వాల్ వ్యక్తిగత విషయానికి వస్తే.. అగర్వాల్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న సమయంలోనే వినీత అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆన్స్ అనే కొడుకు జన్మించాడు. పీపుల్ ఏఐ తెలిపేదాని ప్రకారం.. పరాగ్ అగర్వాల్ ఆస్తి 1.52 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ 11,41,49,720 రూపాయలు. కానీ.., రానున్న ఐదేళ్ల కాలంలో ఈయన ఆస్తి ఘననీయంగా పెరగనుంది. ట్విట్టర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్ సంవత్సరానికి 7,51,13,500.00 రూపాయలు జీతంగా అందుకోనున్నారు. వీటికి కంపెనీ చెల్లించే బోనస్ లు, షేర్స్ అదనం. సో.. చూశారు కదా.. ఇది ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ లైఫ్ స్టోరీ. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Twitter CEO Parag Agrawal is married to Vineeta Agarwala, who is a physician and works as adjunct clinical professor at Stanford School of Medicine#ParagAgrawal #TwitterCEO https://t.co/fjSJA03vkI
— Hindustan Times (@htTweets) November 30, 2021