సాధారణంగా బొగ్గు గనుల్లో ప్రమాదాలు సంబవించడం వింటూనే ఉంటాం. బొగ్గు గనుల్లో కార్మికులు తమ ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట బొగ్గుగనిలో ప్రమాదం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. టర్కీ బొగ్గు గనిలో మిథేల్ పేలుడు సంబవించడంతో పాతిక మంది అక్కడిక్కడే చనిపోయారు. చాలా మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.. మకికొంత మంది అక్కడే చిక్కుకుపోయారు.
టర్కీ.. అమస్రా వద్ద గల బొగ్గ గనిలో భారీ పేలుడు సంబవించింది. శుక్రవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడ తీవ్ర కలకలం రేపింది. బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో పాతిక మంది అక్కడే దుర్మరణం పాలవగా.. చాలా మంది భూ గర్భంలోనే చిక్కుకు పోయినట్లు బయట పడ్డ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా సురక్షితంగా బయటకు రావాలని కుటుంబ సభ్యులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. ప్రమాద సమయంలో 110 మంది కార్మికులు బొగ్గు గనిలో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. అయితే పేలుడు సంబవించిన వెంటనే కొంత మంది కార్మికులు కంగారుగా బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బొగ్గుగనిలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. అందులో కొంత మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగింది రాత్రి సమయంలో కనుక కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఉదయం నుంచి చర్యలు వేగవంతం చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న టర్కీ అధ్యక్షులు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ వెంటనే తన పనులన్నీ రద్దు చేసుకున్నారు. ఆయన ప్రమాద స్థలాన్ని సందర్శంచబోతున్నట్లు తెలుస్తుంది. గత ఏడాదిలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి మూడువందలకు పైగా కార్మికులు చనిపోయారు.
Update- #Rescue operation underway..
At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ— Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022