సమాజంలో జరుగుతున్న పగలు, ప్రతీకార హత్యలు సంబంధించి నిత్యం వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఎవరైన తమ కుటుంబంలో వారిని చంపిన హంతుకుడి ఇంటిపై ప్రతికారం కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు అవకాశం దొరికితే తమ కసి తీర్చుకోవడం కోసం సిద్ధంగా ఉంటారు. అంతేకానీ హంతకుడి ఇంటితో వియ్యం అందుకుంటారా? అది సినిమాల్లో మాత్రం మనం చూస్తాం. కానీ నిజంగా ఓ చోట కూడా అలానే జరిగింది. తన భర్తను చంపిన హంతకుడి కుమార్తెనే తన ఇంటికి కోడలిగా చేసుకుంది ఓ మహిళ. మరి ఆమె అలా ఎందుకు చేశారంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రువాండాలోని ముషాకాలో నివసించే టుట్సీ అనే ఓ తెగకు చెందిన దంపతులు బెర్నడిటే, కబేరా వేడాస్టే. వీరికి ఆల్ఫ్రెడ్ కుమారుడు ఉన్నాడు. అదే ప్రాంతంలో హుటూ అనే తెగ చెందిన గ్రేటియన్ న్యామినాని అనే వ్యక్తి కుటుంబం కూడా నివసిస్తుంది. ఆయనకు యాంకురిజే డొనాటా అనే కుమార్తె ఉంది. అయితే 1994 ఏప్రిల్ 6న హుటూ వర్గానికి చెందిన రువాండా అధ్యక్షుని విమానం కూల్చివేత ఘటన జరిగింది. ఘటనకు ప్రతీకారంగా టుట్సీ తెగ లక్ష్యంగా హుటు వర్గం దాడులకు తెగబడింది. ఆసమయంలో బెర్నడిటే అనే మహిళ భర్తను గ్రేటియన్ న్యామినాని చంపేశాడు. భర్తలేని జీవితం తనకు ఎందుకు అనుకుని జీవితం మీద విరక్తి చెందిన బెర్నడిటే..కొడుకు కోసం గుండెను రాయి చేసుకుంది.
అలా దాదాపు ఏళ్లు 25 గడిచింది. ఈ క్రమంలో గ్రేటియన్ కుమార్తె డొనాటా, బెర్నడిటే కుమారుడు ఆల్ఫైడ్ యుక్త వయస్సుకు వచ్చారు. గ్రేటియాన్ కుమార్తె డొనాటా.. తన తండ్రి వల్లనే బెర్నాడెట్ అనే మహిళ భర్తను కొల్పోయిందని తెలుసుకుంది. దీంతో ఆమె ఇంటికి వెళ్లి చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేది. ఈ క్రమంలో తన తల్లికి సహాయపడుతుండటం చూసి ఆల్ఫైడ్ డొనాటను ప్రేమించాడు. తనపై ఆ యువతి చూపిస్తున్న ఆప్యాయతకు బెర్నడిటే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇదే సమయంలో తన కొడుకు ఆయువతి ప్రేమించుకున్న విషయం బెర్నాడిటేకు తెలిసింది. డొనాటే మంచి మనస్సు, ప్రవర్తన తనకు ముందే తెలుసు కాబట్టి వారిద్దరి వివాహానికి బెర్నాడిటే అడ్డు చెప్పలేదు.
అయితే ఈ క్రమంలో డొనాటా తండ్రి గ్రేటియన్ కి ఈ వివాహంపై అనుమానం వ్యక్తం చేశాడు. “ఆమె భర్తను చంపిన నా కుమార్తెను ఎందుకు కోడలిగా చేసుకోవాలి అనుకుంటుంది” అని సందేహం వ్యక్తం చేశాడు. “నీవు చేసిన తప్పుకు పిల్లలను ఎందుకు శిక్షించాలి. నీపైన కూడా ఎలాంటి ద్వేషంలేదు. పెంచుకుంటూ పోతే పగ, ప్రేమ రెండూ పెరుగుతాయి. కానీ ప్రేమ మనల్ని నిలబెడుతోంది. పగ నాశనం చేస్తుంది” అని బెర్నాడిటే చెప్పిన మాటలకు గ్రేటియన్ మనస్సు కదిలింది. దీంతో గ్రేటియన్.. డొనాటా, ఆల్ఫైడ్ ల పెళ్లికి ఒప్పుకున్నాడు. మరి.. భర్తను చంపిన వ్యక్తి కూతురినే కోడలిగా చేసుకున్న ఈ మహిళ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.