ప్రతి దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నిక అనే ఓ పక్రియ ఉంటుంది. అయితే దేశాన్ని బట్టి ఎన్నికల విధానం మారుతూ ఉంటుంది. ప్రజాస్వామ ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే దేశాల్లో కూలీ చేసే వ్యక్తి నుంచి అత్యంత ధనవంతుడి వరకు ఎవరైన పోటీ చేయవచ్చు. అంతే కాక ఓటు హక్కు వయస్సు నుంచి శరీరంలో సత్తువ ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అదే మాటను ఆదర్శంగా తీసుకున్న ఓ వందేళ్ల వృద్ధుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిని మునుగోడు ఎన్నికల్లో మాత్రం కాదు. నేపాల్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కురు వృద్ధుడు పోటీ చేయనున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నేపాల్ లో నవంబర్ 20న పార్లమెంట్ ఎన్నికలను జరగనున్నాయి. ఈక్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వందేళ్ల వృద్ధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు టీకా దత్తా ఫోఖరెల్ పోటీచేయనున్నారు. అది కూడా మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండపై పోటీకీ సై అంటున్నారు టీకా దత్తా. నేపాలీ కాంగ్రెస్ అనే పార్టీ నుంచి ఎన్నికల బరిలో టీకాదత్తా దిగుతున్నారు. తరఫున గోర్ఖా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గోర్ఖా నియోజగవర్గం నుంచి పోటీ చేసి గెలిచి..హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాజ్యంగా మారుస్తానని టికా దత్తా పోఖరెల్ సంచనల కామెంట్స్ చేశారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్..గూర్ఖా లోని రెండు నియోజకవర్గాల మాజీ ప్రధాని ప్రచండపై పోటీ చేయనున్నారు.
వీరిద్దరితో పాటు ఈ స్థానాల నుంచి మరో 11 మంది అభ్యర్థులపై నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయానికి టీకా దత్తా ఫోకరెల్ కి 99 ఏళ్ల వయస్సు. అదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో కూడా పొందుపరిచారు. అయితే పోఖరెల్ సోమవారం ఆయన 100వ ఏటలోకి అడుగుపెట్టారు. నేపాల్ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యధిక వయసు ఉన్న అభ్యర్థిగా టీకా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పోఖరెల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారనిని నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనకు వయస్సు భారం కాదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tika Dutta Pokharel, a 100-year-old freedom fighter, will contest the election on behalf of the Nepali Congress (BP) with the symbol water vessel. He says he’s entering the political fray to turn Nepal into a Hindu state again
https://t.co/hIAEd9JqFQ— Firstpost (@firstpost) November 2, 2022