ప్రతి మహిళ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన అనుభూతి. అందుకే తల్లి అయ్యేందుకు ప్రతి స్త్రీ తహతహలాడుతుంది. అయితే అవాంఛిత గర్భధారణ వలన మాత్రం మహిళల, యువతులకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే అవాంఛిత గర్భధారణను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు రకాల చట్టలు, పథకాలు ఉన్నాయి. అయితే ఈ అవాంఛిత గర్భధారణలు అరికట్టేందుకు ఫ్యాన్స్ దేశం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. యువతుకు ఉచితంగా కం*డోమ్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు.
గురువారం పశ్చిమ ఫ్రాన్స్‌లోని పోయిటీర్స్ శివారు ప్రాంతమైన ఫాంటైన్-లె-కామ్టేలో ఆరోగ్య అంశంపై యువకులతో ఫ్యాన్స్ మాక్రాన్ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాలపై మాక్రాన్ తెలిపారు. ఈక్రమంలోనే అవాంఛిత గర్భాల గురించి కూడా ఈ సందర్భంగా మాక్రాన్ మాట్లాడారు. త్వరలో 18 నుంచి 25 ఏళ్లలోపు వారికి కండోమ్‌లు ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అవాంఛిత గర్భాలు , లైంగికంగా సంక్రమించే వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్రాన్ వెల్లడించారు. తాము తీసుకున్న ఈ చర్య గర్భనిరోధకం కోసం ఒక చిన్న విప్లవమని ఆయన అన్నారు. ఈ కం*డోమ్ లను ఉచితంగా అందుబాటులోకి ఉంచే ప్లాన్ లో భాగంగా 25 ఏళ్ల లోపు మహిళలందరికి కుటుంబ నియంత్రణను అందుబాటులోకి తీసుకురానుంది.
దీని ద్వారా 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు లక్ష్యంగా తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని విజయవంతం చేయవచ్చన్నారు. అలానే యువతులకు కచ్చితంగా గర్భనిరోధకం అందేలా చేయవచ్చు. లైంగిక విద్యకు సంబంధించి తాము అంత బాగాలేము. ఈ విషయంలో తమ నిపుణులుకు ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలానే కోవిండ్ నియంత్రణ విషయంలో తాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నాని చెప్పాడు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, శీతాకాలం సమీపిస్తున్నందున కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్ లను తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అయితే యువతకు కం*డోమ్స్ అందించే విషయంలో మాక్రాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.