ఈ రోజుల్లో కొన్ని నేరాలు చూస్తుంటే మనుషులేనే ఇంత ఘోరానికి పాల్పడుతున్నది అని ఆశ్యర్యంగా అనిపించక మానదు. కోపంతోనో లేక పగతోనో ఆవేశంలో చేసిని నేరాలు గురించి చాలా విని ఉంటాం. కానీ కొన్ని నేరాలు వినడానికి నమ్మశక్యంగాని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జర్మనీలో జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన ఆర్ స్టెఫాన్ ఒక స్వలింగ సంపర్కుడు. ఇతను మనిషి మాంసం కోసం మొదట ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత కలుద్దామని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంకేముంది ముందే అనుకున్నట్లుగా అతనికి డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతని జననాంగాలను కోసి తినేశాడు. అంతటితో ఊరుకున్నాడా లేదు..అతని శవాన్ని ముక్కలుగా కోసి చెల్లా చెదురుగా పడేశాడు. అయితే పోలీసులు ఆ అవశేషాలను గుర్తించడంతో నవంబర్ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
అవశేషాలను గుర్తించిన పోలీసులు అవి తప్పిపోయిన స్టెఫాన్ టీకి సంబంధించినవిగా గుర్తించారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్‌లోని కాల్‌డేటా ఆధారంగా నిందుతుడు స్టెఫాన్ ఆర్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అయితే బెర్లిన్ కోర్టు తాజాగా ఈ కేసు పూర్వాపరాలను విచారిస్తూ ఇది చరిత్రలోనే అత్యంత అమానవీయమైన ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ప్రిసైడింగ్ జడ్జ్ మాథియాస్ షెర్ట్‌జ్ మాట్లాడుతూ ” 30 ఏళ్లుగా నా సర్వీస్‌లో న్యాయమూర్తిగా ఎన్నో కేసులు చవిచూశాను కానీ ఇంతటి అమానుషమైన కేసు ఇంతవరకు చూడలేదు” అని అన్నారు. అంతేకాదు నరమాంస భక్షణలో భాగంగానే స్టిఫాన్ టీని చంపి శరీరాన్ని కోసి తిన్నట్లు నిర్ధారించారు. పైగా నరమాంస భక్షణలో భాగంగానే వృషణాలను, పురుషాంగాలను అత్యంత జాగ్రత్తగా వేరుచేసినట్లు నిర్థారణైందని న్యాయమూర్తి పేర్కొన్నారు .
#german
German teacher convicted of ‘cannibalism fantasy’ killing https://t.co/Y43xpG0TUV— RawNews1st🎥📰 (@Raw_News1st) January 7, 2022
ఇంత భయంకరమైన అమానుష చర్యకు పాల్పడినందుకు గానూ అతనికి జీవిత ఖైదు విధించారు. పైగా నింధితుడి తరుపు న్యాయవాదులు బాధితుడు తన ఇంట్లోనే సహజ కారణాలతో చనిపోయాడని, తమ స్వలింగ సంపర్కం గురించి ప్రజలు తెలుసుకుంటారనే భయంతోనే స్టిఫాన్ ఆర్ అతని మృతదేహాన్ని నరికి పారవేశాడని వాదించారు. కానీ కోర్టు వాటన్నింటిని తిరస్కరించి నిందితుడికి కఠిన శిక్ష విధించింది. నిధింతుడు శిక్ష విధించే క్రమంలో మౌనంగానే ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ భయానక సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.