ఈ మధ్యకాలంలో తరచూ స్థానిక ప్రజాప్రతినిధులను మొదలకుని, ప్రపంచాధినేతల వరకు అందరిపైన దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలో ఏకంగా అధినేతలే హత్యకు గురవుతున్నారు. గతంలో జపాన్ మాజీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఓ దేశానికి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తినే కాల్చి చంపారు.
ప్రజాప్రతినిధులు అంటే ప్రజలచేత ఎన్నుకోబడి.. వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి. వారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందు కృషి చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై హత్యాయత్నాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రజాప్రతినిధులు హత్యకి గురికావడం జరుగుతుంది. ఇది కేవలం లోకల్ స్థాయిలోనే కాకుండా దేశాధినేతల విషయంలో కూడా జరుగుతుంది. ఇటీవలే జపాన్ మాజీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యాడు. తాజాగా ఉగాండ దేశానికి చెందిన కేంద్ర మంత్రిని అతడి భద్రత సిబ్బందిలో ఒకరు కాల్చిచంపారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..
ఉగాండ దేశ కార్మిక శాఖ మంత్రి, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చార్లెస్ ఎంగోలా(మార్జీ)ని బాడీగార్డ్ కాల్చి చంపాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉగాండ దేశ రాజధాని కంపాలలోని మంత్రి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంగోలా కార్మిక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డ్.. తన వద్ద ఉన్న తుపాకీతో మంత్రిపై కాల్పులు జరిపాడు. అతిసమీపంలో నుంచి కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మరణించాడు.
అయితే ఈహత్యకు గల కారణాలు ఏమిటని ఇంక తెలియరాలేదు. అయితే స్థానిక మీడియా తెలిపిన కథనం ప్రకారం.. మంత్రికి.. సదరు నిందితుడి మధ్య జీతం విషయంలో వివాదం జరిగిదంట. కొన్ని నెలలుగా సెక్యూరిటీ గార్డుకు జీతం రాలేదని, వాటి విషయంలో వివాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర దర్యాప్తు మంత్రి ఇంటికి చేరుకున్నాయి. అలానే పోలీసులు మంత్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆదేశ ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ స్పందించారు.
ఇది దురదృష్టకర సంఘటనని, ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేది దర్యాప్తులో తెలుస్తుందని ట్వీట్ చేశారు. ఇక మరోవైపు ఉగాండ దేశంలో కొన్నేళ్లుగా ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను చంపుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2021లో కంపాలాలో మాజీ ఆర్మీ చీఫ్ వాహనంపై ముష్కరులు కాల్పులు జరిపారు. తాజాగా మంత్రిని గన్‌తో కాల్చి చంపడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. ఇలా ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులు, హత్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.