అయితే, రెస్క్యూ ఆపరేషన్‌లు ఫలించలేదు. 96 గంటల తర్వాత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. టైటాన్ ఎక్కడ ఉందో గుర్తించినట్లు.. లోపల ఉన్న వారందరూ చనిపోయినట్లు
అట్లాంటిక్ సముద్రం అడుగున ఉన్న టైటానిక్‌ను చూడ్డానికి వెళ్లిన ‘టైటాన్’ సబ్‌మెరైన్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రయాణం మొదలైన గంటన్నరకే టైటాన్ బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయింది. దీంతో ప్రమాదానికి గురైన టైటాన్‌ను కనిపెట్టడానికి.. అందులో ఉన్న ఐదుగురిని కాపాడ్డానికి రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. అయితే, రెస్క్యూ ఆపరేషన్‌లు ఫలించలేదు. 96 గంటల తర్వాత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. టైటాన్ ఎక్కడ ఉందో గుర్తించినట్లు.. లోపల ఉన్న వారందరూ చనిపోయినట్లు వారు వెల్లడించారు. దాదాపు 10 రోజుల తర్వాత సముద్రంలో ఉన్న టైటాన్ సబ్ మెరైన్ బయటకు వచ్చింది.
ఒడ్డుకు చేరుకున్న టైటాన్‌లో కోస్ట్‌గార్డ్ అధికారులు అందులో ప్రయాణించిన ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. కుళ్లిన స్థితిలో వారి మృతదేహాలు దర్శనమిచ్చాయి. కాగా, టైటానిక్ యాత్ర కోసం బ్రిటన్‌కు చెందిన హమిష్ హార్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన సంపన్నుడు షహ్‌జాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, టైటానిక్ నిపుణుడు పాల్ హెన్రీ నార్గలెట్, ఓషన్ గేట్ సీఈఓ స్టాక్‌స్టన్ రష్‌తో పాటు ఒక సిబ్బంది ప్రయాణమయ్యారు.
జూన్ 18.. ఆదివారం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌నుంచి టైటానిక్ విహార యాత్ర మొదలైంది. 8 రోజుల ఈ ట్రిప్ కోసం ఒక్కోరు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 21 అడుగుల పొడువున్న ఈ సబ్ మెరైన్‌లో ఎంతో బందోబస్త్‌గా యాత్రను మొదలుపెట్టారు. అయితే, యాత్ర మొదలైన కొన్ని గంటలకే టైటాన్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలతో ఐదుగురు బతికారు. ఆక్సిజన్ అయిపోయానే చనిపోయారు. తాజాగా, వారి శవాలు కుళ్లిన స్థితిలో ఒడ్డుకు చేరుకున్నాయి. మరి, టైటానికి్ యాత్ర కోసంవెళ్లి చనిపోయిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.