రియోలోని 125 అడుగుల ఎత్తైన ఏసుక్రీస్తు విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. ఇటీవల బ్రెజిల్ లో వచ్చిన తుపాను సమయంలో పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో కొన్ని పిడుగులు ఏసుక్రీస్తు విగ్రహాన్ని కూడా తాకాయి.
బ్రెజిల్ రియోలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 125 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం గురించి అందరికీ తెలిసు. పర్యాటకంగా కూడా ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం అది. ఏటా 20 లక్షల మంది వరకు పర్యాటకులు ఆ విగ్రహాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం రియోలోని ఏసుక్రీస్తు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. భారీ తుపాను సమయంలో ఆ విగ్రహంపై పిడుగు పడింది. ఆ సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ దానిని కెమెరాలో బంధించారు. పిడుగుపాటుకు విగ్రహం కాస్త దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రియోలోని క్రిస్ట్ ది రెడీమర్ విగ్రహం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది పర్యాటకులు ఏటా ఆ విగ్రహాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విగ్రహం ఎంతో ఫేమస్ కూడా. అయితే ఇప్పుడు ఆ విగ్రహం పిడుగుపాటు కారణంగా కాస్త దెబ్బితిన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 10న రియోలో వచ్చిన భారీ తుపాను కారణంగా పెద్దఎత్తన పిడుగులు పడ్డాయి. 1999 నుంచి బ్రెజిల్ దేశం.. తుపానుల సమయంలో పడే పిడుగులను లెక్కిస్తూ అధ్యయనం చేస్తోంది. ఒక తుపాను సమయంలో అన్ని పిడుగులు పడటం అదే తొలిసారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Lightning strikes Christ the Redeemer statue in Rio de Janeiro, Brazil. pic.twitter.com/7F8CWuGCrt
— Pop Base (@PopBase) February 11, 2023
ఈ తుపాను సమయంలో కొన్ని పిడుగులు ఏసుక్రీస్తు విగ్రహంపై కూడా పడ్డాయి. విగ్రహం, తల, చేతులపై పిడుగులు పడ్డాయి. పిడుగుల వల్ల విగ్రహం కుడిచేతి బొటన వేలు కాస్త దెబ్బతిన్నట్లు అక్కడి నిర్వాహకులు వెల్లడించారు. త్వరలోనే విగ్రహానికి మరమ్మతులు చేస్తామని తెలిపారు. గతంలో 2010లో 4 మిలియన్ డాలర్లు ఖర్చుచేసి విగ్రహాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏసుక్రీస్తు విగ్రాహంపై పిడుగులు పడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు మాత్రం ఏటా ఆ విగ్రహంపై పిడుగులు పడుతూనే ఉంటాయని చెబుతున్నారు.
Nothing to see here.. just the Statue of Christ in Rio De Janeiro yesterday 😳😳😳 pic.twitter.com/20kx8WkxB4
— Claudia 🇺🇸 MEGA MAGA 🇺🇸 (@ClaudiaWaldsch1) February 12, 2023