సమాజంలో కొందరు అక్రమంగా సంపాదించేందుకు అనేక దారుణాలు చేస్తున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్ , డ్రగ్స్ సరఫర వంటి ఇతర సంఘవిద్రోహక కార్యకలపాలు సాగిస్తున్నారు. అయితే ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని ముఠాలు మూగ జీవాలను సైతం వదలడం లేదు. వాటిని చంపి.. వాటి అవయవాలు ఇతర దేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ చర్యల వలన అనేక జీవ జాతులు అంతరించి పోయాయి. మరికొన్ని అంతరించి పోయే దశలు ఉన్నాయి. తాజాగా నైజీరియాలో గాడిదల పరిస్థితి అలానే ఉంది. అక్కడ వాటి జనాభా గణనీయంగా తగ్గిపోయింది. మరి..నైజీరియాలో గాడిదల సంఖ్య తగ్గడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నైజీరియా-హాకాంగ్ స్మగ్లింగ్ ఆపరేషన్ ద్వారా గాడిద స్మగ్లింగ్ గురించి అనేక విషయాలు బయటపడ్డాయి. చట్టవిరుద్దంగా గాడిద చర్మాలను మెడిసిన్ తయారీ కోసం చైనాకు రవాణా చేస్తున్నారు. స్మగ్లింగ్ ఆపరేషన్ లో అనేక గాడిద పురుషాంగాలు పట్టుబడ్డాయి. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించింది. నైజీరియాలోని లాగోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారం గాడిదల జననాంగాలతో కూడిన 16 బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకో వైపు ‘ది డాంకీ శాంక్చురీ’ అనే బ్రిటీష్ స్వచ్చంద సంస్థ చేసిన సర్వే ప్రకారం చర్మ కోసం ప్రతి సంవత్సరం దాదాపు 4.8 మిలియన్ గాడిదలు చంపబడుతున్నాయి. చైనీయులకు నివారణ ఔషధమైన ఎజియావోను ఉత్పత్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు.
ఈ స్మగ్లింగ్ లో ప్రధాన లబ్ధిదారులుగా చైనా వ్యాపారులు ఉంటారు. తద్వారా నైజీరియాలో జంతువులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. సంతానోత్పత్తి రేటు కూడా దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. కాగా ఈ జంతువుల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు సెనేటర్లు 2021లో ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ బిల్లు చట్టంగా మారాల్సి ఉంది. మరి.. ఈ గాడిదల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thousands of #donkey #penises seized in smuggling operation between #Nigeria and #HongKong.
“Eat a bag of donkey dicks”?
Would I rather eat these or #bugs?https://t.co/IiIoowubEW— Steven Stiles (@StevenS23337721) September 14, 2022