మాములుగా శిశువు జననం అనేది తొమ్మిది కాలంలో జన్మిస్తూ ఉంటారు. ఇదే కాకుండా చాలా మంది గర్భిణీలకు ఏనిమిది నెలలకు, ఏడు నెలలకు కూడా శిశువులు జన్మించటం మనం చాలానే చేశాం. కానీ 5 నెలలకు శిశువు జన్మించినట్లు మీరు ఎక్కడైన విన్నారా?. ఐదు నెలలకు జన్మించటం ఏంటని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారా? కానీ అమెరికాలోని అలబామాకు చెందిన మిచెల్ బట్లర్ అనే మహిళకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో నీకు పుట్టబోయే బిడ్డని త్యాగం చేయకతప్పదు అని వైద్యులు ముందుగానే చెప్పారు.
అలా గతంలో సర్జరీ చేసిన 5 నెలల గర్భిణీలకు పుట్టిన శిశువులు చాలా మటుకు బతికిన దాఖలాలు కూడా లేవట. కానీ మిచెల్ బట్లర్ అనే మహిళకు చేసిన సర్జీరిలో పుట్టిన శిశువు మాత్రం బతికి బట్టకడుతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. 9 వారాల ముందుగానే జన్మించిన కర్టిస్ అనే శిశువు గుండె పుట్టిన వెంటనే ప్రతిస్పందించిందట. దీంతో ఊపిరితిత్తులు కూడా ఆక్సిజన్ తీసుకోవటానికి సహకరించటంతో ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ల సాయంతో 275 రోజులు ఐసీయూలో గడిపిన కర్టిస్ ఈ ఏడాది ఏప్రిల్ లో కర్టిస్ ను డిశ్చార్జ్ చేయటంతో ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. ప్రపంచలోని తొలిసారిగా 5 నెలలకు జన్మించిన ఈ శిశువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుంది. అయితే 9 వారాల ముందుగానే జన్మించిన ఈ శిశువు జననంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.