మన ఇంటికి ఎవరైనా చుట్టాలు, స్నేహితులు వస్తున్నారంటేనే వారి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం .. అదే మన కుటుంబ సభ్యులు చాలా కాలం తరువాత దేశం కాని దేశం నుంచి వస్తుంటే వారికి ఘన స్వాగతం పలుకుతాం. కొన్నేళ్ల తరువాత వస్తున్న తమ వారికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పటానికి ఎయిపోర్ట్ వెళ్తుంటాము. ఆ సమయంలో వారి కోసం పూల బోకే వంటివి తీసుకెళ్తాము. మన వారు చాలా కాలం తరువాత కనిపించే సరికి ఆనందంతో వారిని హత్తుకుంటాము. ఇలాంటివి సర్వ సాధారణం.. ఓ కుమారుడు తన తల్లికి స్వాగతం పలకటానికి ఎయిపోర్టుకి వెళ్తే.. తల్లి నుంచి అనుకోని సత్కారం పొందాడు. చాలా కాలం తరువాత విదేశాల నుంచి వస్తున్న తన తల్లి కోసం ఓ చేత్తో పూల బొకే, మరో చేతిలో మిస్స్ యూ మమ్మీ అనే ఫ్లకార్డు పట్టుకుని ఆమెకు ఎదురెళ్లాడు.అంతే ఆమె ఒక్కసారిగా చెప్పు తీసుకుని తన కొడుకును కొట్టింది. దీంతో ఆ పుత్రరత్నం ఒక్కసారిగా షాకయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే…పాకిస్థాన్ కు చెందిన అన్వర్ జిలాని చాలా కాలం తరువాత తన తల్లి విదేశాల నుంచి తిరిగి వస్తుందని ఘన స్వాగంత పలకాలనుకున్నాడు. ఎయిర్పోర్ట్ కు వెళ్లిన జిలాని ఓ చేతిలో బోర్డు పట్టుకుని, మరోచేతిలో ప్లేవర్ బొకే పట్టుకుని తన తల్లి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఎయిర్ పోర్టులో తల్లి బ్యాగ్ తీసుకుని ఎంటర్ అయ్యింది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్ను చూసి ఆ తల్లి హఠాత్తుగా కాలినుంచి చెప్పు తీసుకుని చితక్కొట్టింది. అనంతరం ఆమె కొడుకుని ప్రేమతో హత్తుకుంది.ఈ వీడియో అన్వర్ జిలానీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.