భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అసలు కలహాలు లేని కాపురం ఉండదు. ఎంత గొడవపడ్డా.. తిట్టుకున్నా.. కాసేపు మాత్రమే. ఆ తర్వాత కలిసిపోతారు. అయితే ఒక్కొసారి భార్య, భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే.. దారుణాలకు దారి తీస్తాయి. తాజాగా థాయ్‌లాండ్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. భర్త అన్నం వండకుండా, మిత్రులతో మందుకొడుతున్నాడని.. తెలిసి.. అతడి భార్యకు చిర్రెత్తుకొచ్చింది. శివంగిలా మారి భర్తపై దాడి చేసింది. ఫిషింగ్ రాడ్ తో భర్త ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి.. ఇంటికి ఈడ్చుకెళ్లింది. ఆ దెబ్బకు అతడి మగతనం పోయింది. నపుంసకుడిలా మారాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
థాయ్‌లాండ్‌కు చెందిన 43 ఏళ్ల చనితా కుడ్‌రూమ్, 45 ఏళ్ల వీవింగ్ ముసిట్స్ భార్యాభర్తలు. భర్త ఏ పనీ చేయడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటి బాధ్యత మొత్తం చనితానే తీసుకుంది. పొలం పనులను చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎప్పటిలాగే మార్చి 3న చనితా తమ పొలానికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి అన్నం వండి పెట్టమని భర్తకు చెప్పింది. పొలంలో పనులను ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన చనితకు భర్త కనిపించలేదు. ఇంట్లో అన్నం కూడా లేదు. అప్పటికే చీకటి పడుతోంది. ఐనా అతడు ఇంటికి రాలేదు.
ఇది కూడా చదవండి: ఒకే ఇంట్లో 8 మంది భార్యలతో హ్యాపీగా కాపురం!
భర్త తీరుతో విసిగిపోయి ఉన్న చనితాకు ఆ రోజు పట్టరాని కోపం వచ్చింది. ఇంటికి వస్తాడేమోనని చాలా సేపు ఎదురుచూసింది. కానీ రాలేదు. చివరకు తానే ఊళ్లోకి వెళ్లి అంతా గాలించింది. ఓ చోట తన మిత్రులతో కలిసి మద్యం తాగుతున్న భర్తను చూసింది. అన్నం వండి పెట్టకుండా.. మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా అని అతడిపై విరుచుకుపడింది. ఫిషింగ్‌రాడ్‌తో భర్త మర్మాంగంపై దాడిచేసింది. అంతటితో ఆగక.. అతడిని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కెళ్లింది.
ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్న భర్తకు ఏమి అనిపించలేదు. మత్తు దిగాక.. మరుసటి రోజు భరించలేని ఒళ్లు నొప్పులతో బాధపడసాగాడు. ఆ నొప్పిని భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. పూడ్చలేని నష్టం వాటిల్లిందని.. అతడు ఇక కాపురానికి పనికి రాడని.. నపుసంకుడయ్యాడని చెప్పడంతో.. వీవింగ్ ముసిట్స్‌తో పాటు అతడి భార్య కూడా షాక్‌లోకి వెళ్లింది. కావాలని భర్తపై అంత దారుణంగా దాడి చేయలేదని.. కోపంలోనే అలా జరిగిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: మొక్కే కదా అని వదిలెయ్యలేదు… 14 లక్షలు పెట్టి మరీ కొన్నారు!..
తన భర్త ఏ పని చేయకుండా తాగుతూ ఉంటాడని.. మద్యం గురించి తప్ప అతడికి ఏమీ గుర్తుండదని చెప్పి వాపోయింది చనిత. ఈ విషయమై వీరింట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి. ఎన్ని సార్లు నచ్చచెప్పినా అతడు మారలేదని.. అందుకే భర్తకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు కొట్టానని.. కానీ అనుకోకుండా ప్రైవేట్‌పార్ట్ కి దెబ్బ తగిలిందని చెప్పి బాధపడింది. తనదే తప్పని ముందూ వెనకా చూసుకోకుండా కొట్టానని కంటతడి పెట్టుకుంది. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ఏడిస్తే ఏం లాభం అంటున్నారు దీని గురించి తెలిసిన జనాలు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.