Texas Woman: అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వింతైన సంఘటన చోటుచేసుకుంది. కడుపుబ్బరం అనుకుని బాత్‌రూమ్‌కు వెళ్లిన ఓ మహిళ అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఆండ్రియానీ గ్రేసన్ అనే 33 ఏళ్ల మహిళ 2021 సెప్టెంబర్ 27వ తేదీన కడుపులో తిప్పినట్లుగా ఉంటే బాత్‌రూంకు వెళ్లింది. బాత్‌రూంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెతో పాటు భర్త కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. గర్భంతో ఉన్నదని తెలియకుండానే ఇలా జరగటం ఏంటి? అని ఆశ్చర్యపోయారు. తాను గర్భం దాల్చినట్లుగా ఎలాంటి లక్షణాలు లేవని, అంతకు ముందు కాన్పుల్లో అన్ని లక్షణాలు ఉన్నాయని గ్రేసన్ తెలిపింది. మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు తన భర్త వాసెక్టమీ చేయించుకున్నాడని వెల్లడించింది.
తన భర్త మాజీ భార్య కూతురితో కలిపి మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారని, తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని తెలిపింది. ఐదో సారి గర్భంతో ఉన్నపుడు మంచిగా తినేదాన్నని, ప్రతిరోజు వర్కవుట్లు చేసేదాన్నని అంది. అంతేకాకుండా. గర్భం దాల్చిన కొద్దిరోజులకే బరువు తగ్గానని, మళ్లీ కొన్ని నెలల తర్వాత బరువు పెరిగానని చెప్పింది. అయితే, డెలివరీకి రెండు నెలల ముందు కడుపు ఉబ్బరాలు ఎక్కువవటంతో వర్కవుట్లు చేయటం మానేశానని తెలిపింది. తనకు జీర్ణ సంబంధం సమస్యలు ఉన్నాయని, అప్పుడప్పుడు కొన్ని ఆహార పదార్ధాల వల్ల కడుపుబ్బరం వస్తుంటుందని పేర్కొంది. డెలివరీ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కడుపుబ్బరంతో బాధపడ్డానని, ఆ టైంలోనే బిడ్డకు జన్మనిచ్చానని తెలిపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇవి కూడా చదవండి : ఆ ఒక్క ఫొటోతో సెలెబ్రిటీ అయిపోయిన పోలీస్ కానిస్టేబుల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.