గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
అతి వేగం కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాద ఘటన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది నైజీరియా లోగోస్ పరిధిలోని ఇకెజా ప్రాంతం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బస్సుల్లో విధులకు వెళ్తున్నారు. బస్సు రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు పట్టాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే అటు నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఆ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు విడిచారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను బయటకు తీసి వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు చేరవేశారు. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) March 10, 2023