ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన చంద్రశేఖరన్ టాటా గ్రూపులో యంగెస్ట్ సీఈవో. 2009లో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2012లో నాస్కాం ఛైర్మన్ గా నామినేట్ అయ్యారు. 2009లో టీసీఎస్ సీఈవోగా కంపెనీ లాభాల బాట పట్టింది. ఆయన సారధ్యంలో టీసీఎస్ ఎక్కువ మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. చంద్ర నాయకత్వంలో టీసీఎస్- ఐటీ సర్వీసుల్లో గ్లోబల్ గా మంచి ఇమేజ్ సంపాదించింది.
భారత్‌లో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సరికొత్త బ్రాండ్ నినాదం ‘బిల్డింగ్ ఆన్ బిలీఫ్’ ను ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ‘ఎక్స్‌పీరియెన్స్ సెర్టినిటీ’ నినాదాన్ని సంస్థ మార్చింది. ఖాతాదారులు కోరుకున్న పనిని సాకారం చేసేందుకు తోడ్పాటు అందిస్తామని టీసీఎస్ వెల్లడించింది. 2015-16లో టీసీఎస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 70 బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ తో 2015-06 సంవత్సరానికి మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలబడింది.
ప్రపంచంలోని అత్యుత్తమ మూడు ఐటీ సేవల బ్రాండ్‌లలో టీసీఎస్ ఒకటని బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించిన సంగతి విదితమే. 2010-20 దశాబ్దంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా సైతం నిలిచింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో టీసీఎస్ సూపర్‌బ్రాండ్ గుర్తింపు పొందింది.