ప్రస్తుతం ప్రంపచవ్యాప్తంగా రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన నేతలు, పార్టీలు పాలన కొనసాగిస్తున్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో.. ఇప్పటికి రాచరిక పాలన కొనసాగుతుంది. మరి రాజ్యం అంటే దేశానికి రాజు.. ఆయనకు ఎనలేని సంపద.. అంతులేని భోగభాగ్యాలు విలసాలతో అలరారుతుంటారు. రాజు పేరు చెప్పుకుని.. ఆయన కుటుంబీకులు, పరివారం అన్ని రకాల మర్యాదలు పొందుతారు.
కానీ ఎక్కడైన రాజు గైడ్ పని చేయడం.. అదీ లేనప్పుడు చేపలు పట్టి అమ్ముకుని కుటుంబ పోషణ చేయడం గురించి విన్నారా లేదా. అయితే మీకు ప్రపంచంలోనే అత్యంత వింత రాజ్యం గురించి పరిచయం చేయబోతున్నాం. ఇక్కడ జనాభా ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.. ఇక్కడ రాజు చేపల వేట కొనసాగిస్తాడు. ఆ వింత రాజ్యం విశేషాలు..
టవోలారా అనే ఈ రాజ్య జనాభా కేవలం 11 మంది మాత్రమే. అవును మీరు చదవింది నిజమే కేవలం 11 మంది మాత్రమే.. వారు కూడా రాజు కుటుంబీకులే. ఇక ఈ బుల్లి రాజ్యం.. ఇటలీకి పశ్చిమాన ఉన్న సార్డినియా ఐలాండ్ కు సమీపంలోని ఉన్న చిన్న ద్వీపం. దీని విస్తీర్ణం కేవలం 5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ రాజ్య ప్రస్తుత చక్రవరి పేరు ఆంటోనియో బెర్టోలియోని. ఆయన వయసు 87 ఏళ్లు. ప్రస్తుతం రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరో 10 మంది ఈ ద్వీపంలో నివసిస్తున్నారు.
పర్యాటక రంగమే ఈ రాజ్యానిక ముఖ్యమైన ఆదాయ వనరు. రంగురంగుల మేకలు, అందమైన బీచ్ లను చూడటానికి ఏటా ఇక్కడకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. వారిని చక్రవర్తే స్వయంగా పడవల్లో తిప్పుతూ.. గైడ్ పని చేస్తుంటారు. టూరిస్టులు లేని సమయంలో చేపలు పట్టి.. సమీప ప్రాంతాలకువెళ్లి అమ్ముతుంటాడు.
ఈ రాజ్యం ఎలా ఏర్పడింది అంటే..
ఈ రాజ్యం ఏర్పాటు వెనక 200 ఏల్ల చరిత్ర ఉంది. 1807లో జెసెప్పే బెర్టోలియోని అనే వ్యక్తి రెండో వివాహం చేసుకొని టవోలారాకు వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాడు. భార్య, బిడ్డలతో కలిసి దీవిలో ఉంటున్న సమయంలో 1836లో ఓ సారి ఈ ఐలాండ్ కు సార్డినియా చక్రవర్తి వేటకు వచ్చి.. జెసెప్పే ఇంట్లో బస చేశాడు. ఆ సమయంలో అతడి కుమారుడు.. పాలో.. తనను టవోలారాకు చక్రవర్తిగా పరిచయం చేసుకున్నాడు. మూడు రోజులు అక్కడే ఉన్న సార్డినియా చక్రవర్తి వారి ఆతిథ్యానికి మెచ్చి.. పాలోని నిజంగానే టవోలారాకు చక్రవర్తిని చేస్తానని మాట ఇచ్చి.. అలానే చేశాడు.
అప్పటి నుంచి పాలో, తన తర్వాత మరో ఏడు తరాలు ఈ ఐలాండ్ లో రాజభోగాలు అనుభవించారు. 1934లో ఈ ఐలాండ్ ఇటలీ అధీనంలోకి వచ్చింది. దాంతో బెర్టోలియోని రాచరికం ముగిసింది. కానీ ఐలాండ్‌కు రక్షకుడిగా కొనసాగే అవకాశం లభించింది. ప్రస్తుత చక్రవర్తి ఆంటోనియో మాత్రం టవోలారాని స్వతంత్ర రాజ్యంగా గుర్తించాలని కోరుతున్నాడు. ఈ వింత రాజ్యం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.