సాధారణంగా చిన్న పిల్లలు ఊయల ఊగడం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. గ్రామాల్లో చెట్లకు ఊయల కట్టి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఊయల ఊగడం అదో అందమైన ఆటవిడుపు. ఇక పట్టణాల్లో ఈ ఊయలలు పార్కుల్లో దర్శనం ఇస్తుంటాయి. కొంత మంది తమ ఇళ్లల్లో కూడా ఊయల ఏర్పాటు చేసుకుంటారు. సాధారణంగా ఊయల అనేది చెట్టుకో.. ఇనప స్థంబాలకో.. లేదా ఇంటి దూలానికో కట్టి ఊగుతుంటారు.
కానీ.. తాలిబన్లో మాత్రం వాళ్ల రేంజ్ కి తగ్గట్టుగానే ఊయల కట్టి మరీ ఊగుతున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారం చెలాయిస్తున్న తాలిబన్లు సరదా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వాళ్లు ఏది చేసినా వెరైటీగా చేసి చూసేవారికి మతులు పోయేట్టు చేస్తుంటారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో తాలిబన్లు చిన్నారులు ఆడుకునే బొమ్మకార్లలో తిరిగి సంబరపడిపోయారు. తాజాగా ఇప్పుడు ఓ యుద్ధ విమానం రెక్కకు తాడుకట్టి ఊయల ఊగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
కాగా, చైనా విదేశాంగశాఖకు చెందిన అధికారి లిజైన్ ఝావో తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ అమెరికాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘ఇది ముమ్మాటికి అమెరికన్ల దురాఘతానికి మచ్చు తునక.. ఇది పాలకుల కాలం నాటి శ్మశాన వాటిక. వారి యుద్ధ విమానాలు. ఆ విమానాలను తాలిబన్లు ఊయలలా, ఆట వస్తువుల్లా మార్చుకుంటున్నారు’’ అంటూ పేర్కొన్నారు. అయితే ఇది అప్పట్లో అమెరికా సైనికుల స్థావరాలు అయి ఉండొచ్చని.. వారు వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి దుస్థితి ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.
The graveyard of EMPIRES and their WAR MACHINES. Talibans have turned their planes into swings and toys….. pic.twitter.com/GMwlZKeJT2
— Lijian Zhao 赵立坚 (@zlj517) September 9, 2021