తుపాకులను నమ్ముకుని.. ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజలను భయపెట్టి అఫ్గానిస్తాన్ గద్దెనెక్కారు తాలిబన్లు. ఇష్టం వచ్చినట్లు పాలన వ్యవహారాలను మార్చేసి.. అడ్డగోలుగా నిబంధనలు విధించారు. దీంతో పాలన గాడి తప్పింది.. జనజీవనం అస్తవ్యస్తమైంది. మెల్లమెల్లగా దేశంలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుంది. దేశప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్న తరుణంలో తాలిబన్ల కళ్లు తెరుచుకున్నట్లున్నాయి. దేశాన్ని పాలించడం అంటే తుపాలను పేల్చినంత సులువు కాదని విషయం బోధపడి ఉంటుంది. దీంతో తమ పంతాన్ని వదిలి తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది.
అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. తాజాగా అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ గోధుమల ఎగుమతి.. అంగీకరించిన పాకిస్తాన్
‘‘ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, తాము అధికారం చేపట్టేనాటికే అఫ్గన్ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారని ఆరోపించారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అఫ్గన్‌పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలన్నారు. అఫ్గన్ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు. అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. గొడవలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్‌నిస్థాన్ బాగుపడేది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి తాలిబన్లలో వచ్చిన ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తొలిసారి ప్రజల్లోకి వచ్చిన తాలిబన్ నేత అఖుండ్ జాదా