ఆఫ్ఘనిస్తాన్‌లోతాలిబాన్ల దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి. క్రూరత్వంతో కూడిన శిక్షల అమలును మళ్లీ ప్రారంభించారు. ఓ వైపు శాంతి మంత్రాలు జపిస్తూ.. తాము హింసా ప్రవృత్తిని మానేశామని.. మంచి పాలన కొనసాగిస్తామని చెబుతూనే.. దేశ పౌరులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఇటీవలే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో హెరాత్ ప్రావిన్స్‌లో నలుగురిని హతమార్చి క్రేన్‌లకు వేలాడదీసి ప్రదర్శన ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
తాజాగా తాలిబన్లు మరో ఘాతుకానికి తెగబడ్డారు. తండ్రి పంజ్ షీర్ ప్రతిఘటన దళంలో పనిచేశాడని.. చిన్న పిల్లాడని కూడా చూడకుండా అతడి కుమారుడిని తాలిబన్లు అతి కిరాతకంగా చంపేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్న ఆ బాలుడి చుట్టూ చిన్న పిల్లలు రోధిస్తూ కంటతడి పెట్టించారు. స్వతంత్ర స్థానిక మీడియా ఔట్‌లెట్ పంజ్‌షిర్ అబ్జర్వర్ బాలుడి మృతదేహాన్ని చూపించే వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
అయితే తాలిబన్ల చేతికి పంజ్ షీర్ ప్రావిన్స్ వెళ్లిపోకుండా చివరికంటా ప్రతిఘటన దళాలు పోరాడాయి. తాలిబన్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీన్ని పెద్ద ఛాలెంజ్ గా తీసుకొని తాలిబన్లు రక రకాల వ్యూహాలతో పంజ్ షీర్ దాడులు కొనసాగించారు. కొన్ని వారాలపాటు తిరుగుబాటు దళానికి, తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం జరిగింది. తర్వాత పంజ్‌షిర్ ప్రావిన్స్‌నూ స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు.
GRAPHIC: Child executed in #Takhar province by Taliban fighters after his father is suspected of being in the Resistance. #WarCrimes #Afghanistan pic.twitter.com/QghxcxDJco
— Panjshir Observer (@PanjshirObserv) September 26, 2021