Groom: ఒకప్పుడు స్వయం వరాలు ఉండేవి. అందులో యువతులు తమకు నచ్చిన వారిని ఏరికోరి పెళ్లి చేసుకునే వారు. తర్వాతి కాలంలో స్వయం వరాలు పోయాయి. తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వారిని చేసుకునే కాలం వచ్చింది. అందరి పరిస్థితి ఏమో కానీ, కొంతమంది అమ్మాయిలు తమకు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల మాట కాదనలేక తలవంచుకుని తాళి కట్టించుకుంటున్నారు. కొంతమంది తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ, వీటన్నింటికి భిన్నంగా ఓ యువతి వరుడు కావాలంటూ రోడ్లపైకి ఎక్కింది. చేతిలో ప్లకార్డు పట్టుకుని ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఈ సంఘటన సూడాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళిలే.. సూడాన్‌లోని ఖార్టమ్‌కు చెందిన ఓ యువతి చేతిలో ప్లకార్డుతో అక్కడి వీధుల్లోకి వచ్చింది. ఆ ప్లకార్డులో ‘‘ నేను పెళ్లి చేసుకోవటానికి నాకో వరుడు కావాలి. బహుభార్యాత్వానికైనా(రెండు కంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండటం) నేను రెడీ’’ అని రాసి ఉంది. ప్లకార్డు కింది భాగంలో ఆమె ఫోన్ నెంబర్ కూడా రాసి ఉంది. ఓ వ్యక్తి ప్లకార్డుతో ఉన్న ఆ యువతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో ఆమె వైరల్‌గా మారింది. ఖార్టమ్ సిటీ సదరు యువతి గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. కాగా, గత కొన్నేళ్లుగా సూడాన్లో వివాహాల రేటు గణనీయంగా పడిపోతోంది. వీటికి తోడు విడాకులు కూడా పెరుగుతున్నాయి.
2018తో పోల్చుకుంటే 2020నాటికి వివాహాల రేటు 21శాతానికి పడిపోయింది. 2018లో 180,563 పెళ్లిళ్లు జరగ్గా.. 2020లో 142,949 పెళ్లిళ్లు మాత్రమే జరిగాయి. వివాహాల రేటు పడిపోవటానికి కరోనా కూడా ఓ ప్రధాన కారణంగా మారింది. ఇక్కడో షాకింగ్ విషయం ఏంటంటే.. గత సంవత్సరం సూడాన్ వ్యాప్తంగా ప్రతి గంటకు ఓ విడాకుల కేసు నమోదైంది. 2020లో 60వేల మందికిపైగా విడాకులు తీసుకున్నారు. మరి, యువతి ప్లకార్డు పెళ్లి ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Google Maps: ఆ ఇంటిని బ్లర్ చేసిన గూగుల్ మ్యాప్స్.. కారణం ఏంటంటే!