చాట్ జీపీటీ ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ వల్ల ఇప్పటికే కోట్లాది మంది ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని.. రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాట్ జీపీటీని నిషేధించాలంటూ ఎలాన్ మస్క్ సహా వెయ్యి మందికి పైగా బహిరంగ లేఖ రాశారు. అసలు ఏమైంది? నిషేధించమనడానికి కారణం ఏంటి?
ప్రస్తుతం ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా చాట్ జీపీటీ మాటే. ఓపెన్ ఏఐ అనే సంస్థ అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ కొందరికి వరంగా మారగా మరికొంతమందికి శాపంగా మారింది. చాట్ జీపీటీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వల్ల 20 రంగాలకు సంబంధించిన ఉద్యోగాలకు గండి కొడుతుందని.. వేలలో ఉద్యోగులు రోడ్డున పడతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాట్ జీపీటీ వల్ల మానవాళి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలు దిగ్గజ కంపెనీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ సహా 1344 మంది నిపుణులు ఈ చాట్ జీపీటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. తక్షణమే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాలని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్ పెరిమెంట్స్ పేరుతో లేఖను రాశారు. ఈ లేఖపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ సంతకాలు చేశారు. ఇటీవలే కంపెనీ చాట్ జీపీటీ-4 ను పరిచయం చేసింది. మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 లాంటి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థలు సమాజానికి, మానవాళికి ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు లేఖలో పేర్కొన్నారు. మానవాళికి అనుకూలంగా సానుకూల ఫలితాలు ఇచ్చే వ్యవస్థలనే అభివృద్ధి చేయాలని లేఖలో రాశారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తితే నియంత్రించగలమనే నమ్మకం ఉంటేనే అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వైపు అడుగులు వేయాలని సూచించారు.
జీపీటీ-4 కంటే శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిలిపివేయని యెడల ప్రభుత్వాలు జోక్యం చేసుకుని నియంత్రించాలని కోరారు. చాట్ జీపీటీ4 కన్నా పవర్ ఫుల్ ఏఐ సిస్టమ్స్ కు శిక్షణ ఇస్తున్న అన్ని ఏఐ ల్యాబ్స్ ని కనీసం 6 నెలల వరకూ అయినా నిలిపివేయాలని నిపుణులు లేఖలో కోరారు. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తరపున నిపుణులు బహిరంగ లేఖను రాశారు. ఈ సంస్థకు నిధులు సమకూర్చే వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. లేఖలో సంతకం చేసిన వారిలో ఓపెన్ ఏఐ ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక టెస్లా కార్ల కోసం ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థలను ఎలాన్ మస్క్ అభివృద్ధి చేస్తుండడం గమనార్హం. మరి చాట్ జీపీటీని నిషేధించాలని ఎలాన్ మస్క్ సహా 1344 మంది నిపుణులు కోరడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
BREAKING: A petition is circulating to PAUSE all major AI developments.
e.g. No more ChatGPT upgrades & many others.
Signed by Elon Musk, Steve Wozniak, Stability AI CEO & 1000s of other tech leaders.
Here’s the breakdown: 👇 pic.twitter.com/jR4Z3sNdDw
— Lorenzo Green 〰️ (@mrgreen) March 29, 2023