Lottery: అదృష్టం ఎలాంటిదంటే.. మన ఊహలకు అందనిది. అందుకే మనల్ని అదృష్టం వరించినపుడు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది. ఇక, డబ్బుల విషయంలో అదృష్టానికి దేనీకి లేనంత ప్రాధాన్యత ఉంటుంది. డబ్బులు కురిపించే లాటరీలాంటివి మన తెలివి తేటల మీదకంటే అదృష్టం మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే లాటరిలో డబ్బులు గెలుచుకున్నపుడు కలిగే సంతోషం ఓ హైలో ఉంటుంది. తాజాగా, ఓ ఇద్దరు ఈ హై సంతోషాన్ని అనుభవించారు. కొని మరిచిపోయిన లాటరీకి కోట్ల రూపాయల లాటరీ తగలటంతో సంతోషంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా, మిచిగాన్‌లోని స్టెర్లింగ్ హైట్స్‌లో ఓ క్లబ్ ఉంది. ఆ క్లబ్ పేరు ‘‘స్టెర్లింగ్ హైట్స్ లాటరీ క్లబ్’’. ఈ క్లబ్ పనేంటంటే లాటరీలు కొనడమే. లాటరీలు కొనటంలో ఆసక్తి ఉన్నవారు కొందరు గ్రూపుగా ఏర్పడి ఈ క్లబ్‌ను స్థాపించుకున్నారు.
కొన్ని నెలల క్రితం ఈ క్లబ్‌కు చెందిన తమ్మి లెన్ హాసెన్.. వ్యాన్ డైక్ అవెన్యూలోని మీజర్ షాపునుంచి పవర్ బాల్ 1 మిలియన్ డాలర్స్ లాటరీ కొన్నాడు. ఆ టిక్‌ట్‌ను తీసుకుని పర్సులో పెట్టుకున్నాడు. నెలలు గడిచాయి. ఆ లాటరీ కొన్న సంగతి మార్చిపోయాడు. ఓ రోజు ఆ లాటరీకి ప్రైజ్ మనీ వచ్చినట్లు అతడికి తెలిసింది. దీంతో వెంటనే లాటరీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేశాడు. అది నిజమే అని తెలిసింది. దీంతో తమ్మి, అతడి మిత్రురాలు కర్జ్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
మొదటినుంచి వీరిద్దరూ కలిసి లాటరీలు కొనేవారు. ప్రైజ్ తగిలితే డబ్బుల్ని ఇద్దరూ పంచుకోవాలని నిశ్చయించుకున్నారు. కర్జ్, లెన్‌హాసన్‌లు లాటరీ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి రూ. 7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని తీసుకున్నారు. తమ రిటైర్‌మెంట్ తర్వాత ఫ్యామిలీకి చేదోడుగా ఉండేందుకు ఆ డబ్బును ఉపయోగిస్తామని వారు తెలిపారు. మరి, మర్చిపోయిన లాటరీకి 7 కోట్ల రూపాయలు తగలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పో*ర్న్ వీడియోస్ చూస్తూ.. నెలకు రూ.3.75 లక్షల సంపాదన!