రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా మన దేశంలో చమురు ధరలుపెరగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కనుక త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్‌పై 50 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 75 రూపాయలు పెరిగింది. అయితే ఇది మన దేశంలో కాదు. ఇంత భారీగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన ఆ దేశం ఏదో తెలియాలంటే.. ఇది చదవండి.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారతీయ విద్యార్థి! కారణం?
ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశం శ్రీలంక ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యింది. శ్రీలకంలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) తాజాగా ఇంధన ధరనలు భారీగా పెంచింది. లీటర్ డీజిల్‌పై రూ.75(శ్రీలకం రూపాయి), పెట్రోల్‌పై రూ.520 చొప్పున పెంచడంతో.. ప్రస్తుతం ఆ దేశంలో ఇంధన ధరలు 200 రూపాయల కన్నా అధికంగా పెరిగింది. ఎల్‌ఐఓసీ తాజాగా పెంచిన రేట్లతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర 254 రూపాయలు కాగా.. డీజిల్ ధర 214 రూపాయలకు చేరింది. ద్రవ్యోల్భణం కారణంగా శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎల్‌ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: యుద్ధం విషయంలో పుతిన్ ను శాంతింపజేసే వ్యక్తి అతడే!శ్రీలంకలో ఒకే నెలలో పెట్రో ధరలను పెంచడం ఇది మూడోసారి. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ప్రజలు ఇక్కట్లు మరింత పెరగనున్నాయి. ధరల పెంపుపై ఎల్ఎస్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా స్పందించారు. శ్రీలంక సర్కారు నుంచి ఎల్‌ఐఓసీ ఎలాంటి రాయితీలు పొందదని.. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని మనోజ్ పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే.. ఇందన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదన్నారు. ధరలు పెంచినప్పటికీ, భారీ నష్టాలు తప్పడం లేదని ఆయన ఆందోళన వ్యక్త చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీలంక చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్.. చమురు ధర పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన చమురు ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.